Covid-19 : కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందే భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్..ఇద్దరు స్టార్ ప్లేయిర్స్ కు కరోనా

కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందే భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయిర్స్ కు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘన ఇద్దరికి కరోనా సోకింది. కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరంలో పాల్గొన్న మహిళల జట్టులో పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘనకు కరోనా సోకినట్లు భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అధికారులు ధ్రువీకరించారు.

Covid-19 : కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందే భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్..ఇద్దరు స్టార్ ప్లేయిర్స్ కు కరోనా

Covid (1)

covid test positve : కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలిసారి మహిళల టీ20 క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో భారత మహిళల జట్టు శుక్రవారం ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘన ఇద్దరూ కరోనా బారిన పడ్డారు.

కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరంలో పాల్గొన్న మహిళల జట్టులో పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘనకు కరోనా సోకినట్లు భారత ఒలింపిక్ సంఘానికి చెందిన అధికారులు ధ్రువీకరించారు. వీళ్లిద్దరికి కరోనా నెగిటివ్ అని తేలిన తర్వాతనే జట్టుతో కలుస్తారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో ఆడే సిరీస్ ఓపెనర్‌లో వీళ్లిద్దరూ జట్టుకు అందుబాటులో ఉండరు.

2022 Commonwealth Games : 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ రీఎంట్రీ.. ఈసారి మహిళా క్రికెట్‌కు అవకాశం

ఈ నెల 31న పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఆ సమయానికైనా పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘన జట్టుతో కలుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మెగా టోర్నీలోని మ్యాచులన్నీ ఎడ్జ్‌బాస్టన్ వేదికగానే జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయినట్లు వెల్లడించారు.