Balakrishna: క్రేజీ టాక్.. సంపత్ నందితో బాలయ్య సినిమా?

ఈమధ్యనే దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్..

Balakrishna: క్రేజీ టాక్.. సంపత్ నందితో బాలయ్య సినిమా?

Balakrishna

Balakrishna: ఈమధ్యనే దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారు చేసుకున్న బాలయ్య ఆ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ మరోసారి బాలయ్య మార్క్ మేనరిజం.. మాసివ్ క్రేజ్ అభిమానులను ఫిదా చేసేసింది. మరోవైపు అనిల్ రావిపూడి సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాబోతుంది.

NBK107: బాలయ్య ద్విపాత్రాభినయం.. మరోసారి తండ్రికొడుకులుగా?

అదలా ఉండగానే మరోసినిమా కూడా ఖరారయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. యంగ్ దర్శకుడు సంపత్ నంది బాలయ్యతో సినిమా కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య బాలయ్యకి సంపత్ నంది ఓ కథ చెప్పాడని బాలయ్య కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని రూమర్స్ వచ్చాయి. మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. దాదాపుగా ఈ సినిమా ఖరారైనట్లు తెలుస్తుంది. టాలీవుడ్ బడా నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను సెట్ చేసినట్లుగా తెలుస్తుంది.

NBK107: బాలయ్య ఫస్ట్ లుక్.. స్టైలిస్ట్ మాసివ్ అవతార్!

సి కళ్యాణ్ బాలయ్య హీరోగా ఒక సినిమా చేయడానికి కొద్దిరోజులుగా కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంపత్ నంది చెప్పిన కథతోనే ఈ సినిమా సెట్ అయినట్లుగా వినిపిస్తుంది. పక్కా రాయల్ లుక్ తో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నాడని.. ఇది కేవలం బాలయ్యకి మాత్రమే సరిపడే కథని చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం.. ఈ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది.