Cultivation Of Indigenous Rice : సేంద్రియ విధానంలో దేశీ వరి సాగు

దేశీవరి రకాలలో అధిక ఔషద గుణాలు ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగుచేస్తున్న వారిలో ఒకరు తూర్పుగోదావరి  జిల్లా, అనపర్తి మండలం, అనపర్తి గ్రామానికి చెందిన రైతు కర్రి వీరరాఘవరెడ్డి.

Cultivation Of Indigenous Rice : సేంద్రియ విధానంలో దేశీ వరి సాగు

Cultivation of indigenous rice

Cultivation Of Indigenous Rice : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది రైతులు సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నారు.

READ ALSO : Bacterial Blight Of Rice : వరిపంటలో ఎండాకు తెగులు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ప్రకృతి ప్రసాదించిన ప్రాచీన వరి వంగడాల్లో సహజ సిధ్దమైన అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. కాని వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో వీటి విలువ తెలిసినా, దిగుబడి తక్కువ వస్తుండటంతో రైతులు వీటి సాగుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాలచక్రం గిర్రున తిరిగి మళ్లీ మొదటికే వచ్చినట్లు, వీటి విలువ తెలిసిన కొంతమంది, తిరిగి వీటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. మంచి ధర, ఆరోగ్య భద్రత ఉండటంతో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి రకాలను పండిస్తూ..  ముందుకు సాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు.

READ ALSO : Paddy Pest Control : వరిపంటలో సుడి దోమ ఉదృతి! నివారించేందుకు సస్యరక్షణ చర్యలు

ముఖ్యంగా  అంతరించిపోతున్న దేశీవరి రకాలలో అధిక ఔషద గుణాలు ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగుచేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగుచేస్తున్న వారిలో ఒకరు తూర్పుగోదావరి  జిల్లా, అనపర్తి మండలం, అనపర్తి గ్రామానికి చెందిన రైతు కర్రి వీరరాఘవరెడ్డి.  తనకున్న2 ఎకరాల్లో దేశీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు.  సేంద్రియ విధానంలో సాగుచేయడం వల్ల, తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన దిగుబడి పొందుతున్నారు.