Bacterial Blight Of Rice : వరిపంటలో ఎండాకు తెగులు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఉదయం సమయంలో ఎండ తీవ్రత పెరిగే కంటే ముందు తెగులు పోకిన ఆకుల నుండి పసుపురంగు జిగురు బిందువులు ఆకులపైన కనిపిస్తాయి. క్రమేపి ఈ జిగురు ఎండకు గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా పలుకులుగా మారిపోతాయి. గాలి వీచినప్పుడు ఆకు నుంచి క్రింద ఉన్న నీటిలో పడతాయి.

Bacterial Blight Of Rice : వరిపంటలో ఎండాకు తెగులు, నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Sun rot in rice, precautions to be taken for prevention!

Bacterial Blight Of Rice : ప్రధాన ఆహర పంటలలో వరి కూడా ఒకటి. వాతావరణ పరిస్థితులు వరి పంటపై తీవ్ర ప్రభావాన్ని, నష్టాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వరిలో వివిధ రకాల తెగుళ్ళు, పురుగులు, ఆశిస్తున్నాయి. ఇందులో బ్యాక్టిరియా ఆకు ఎండుతెగులు ఎక్కువగా ఆశించి పంటకు నష్టం కలుగజేస్తుంది. వరి పంటను బ్యాక్టిరియా ఆకు ఎండు తెగులు, దుబ్బు చేసుకునే దశ నుంచి చిరుపోట్ట దశ వరకు ఆశించే అవకాశం ఉంటుంది. వర్షాలు ఈ తెగులు రావటానికి ప్రధాన కారణం. అధిక వేగంతో గాలులు, ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు 2-4 రోజులు పడటం, తక్కువ ఉష్ణోగ్రతలు 22-26డిగ్రీలు నమోదు కావడం, అధిక మొతాదులో నత్రజని ఎరువుల వినియోగం, పంట తెగులును తట్టుకోలేని రకాలను సాగు చేయుటం వంటి వాటి వల్ల తెగులు వస్తుంది.

నారుమడి దశలో తెగులు పోకితే ఆకుల చివర్ల నుండి క్రింద వరకు ఆకులు రెండు ప్రక్కల నీటి మచ్చులు ఏర్పడతాయి. ఈ ఆకులు క్రమేణ పసుపు రంగులోకి మారిపోతాయి. దీనినే క్రెసెక్‌ దశ అంటారు. ప్రధాన పొలంలో నారు నాటిన తర్వాత పిలక దశలో ఆశించినట్లయితే ఆకులపై పసుపురంగు నీటి డాగు మచ్చులు అలల మాదిరిగా ఆకుల అంచుల వెంబడి ఆకులపై నుండి క్రింది వరకు వస్తాయి.

ఉదయం సమయంలో ఎండ తీవ్రత పెరిగే కంటే ముందు తెగులు పోకిన ఆకుల నుండి పసుపురంగు జిగురు బిందువులు ఆకులపైన కనిపిస్తాయి. క్రమేపి ఈ జిగురు ఎండకు గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా పలుకులుగా మారిపోతాయి. గాలి వీచినప్పుడు ఆకు నుంచి క్రింద ఉన్న నీటిలో పడతాయి. లేదా వర్షపు జల్లులు వేగానికి వేరే ఆకులపైన పడతాయి. ఈ విధంగా బ్యాక్టిరియా ఉన్న నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారాను లోపలకి ప్రవేశిస్తాయి. ఈనిక దశలో తెగులు ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

నివారణ చర్యలు ; ఈ తెగులు నివారణకు తెగులును తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవటం. పొలంలో తెగుళ్ళ లక్షణాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తొలి దశ క్షణాలు గమనించినట్లయితే నత్రజని ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపివేసి మురుగునీరు పోయే సౌకర్యం ఉండే విధంగా చూసుకోవాలి.

తెగులు దుబ్బు కట్టే దశ నుంచి చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ (సిఒసి) 3 గ్రాములు+ 0.4 గ్రాములు ప్లాంటామైసిన్‌ లేదా 0.2 గ్రాములు ప్లాంటామైసిన్‌ లేదా, పోషామైసిన్‌ మందును పొలంలో మురుగు నీరు తీసివేసి పీచికారి చేయాలి. ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి నీటిని పారించవద్దు. ఎందుకంటే ఈ తెగులు నీటి ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది.