బంగాళాఖాతంలో అల్ప పీడనం.. 24 గంటల్లో Amphan తుఫాన్

  • Published By: Subhan ,Published On : May 16, 2020 / 05:29 AM IST
బంగాళాఖాతంలో అల్ప పీడనం.. 24 గంటల్లో Amphan తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని లోతట్టు తీర ప్రాంతాలకు హెచ్చరికలు అందజేశారు. 

వాయువ్యదిశలో ఆరంభమై మే 17వరకూ కొనసాగుతుందని.. మళ్లీ మలుపు తీసుకుని ఉత్తర వాయువ్య దిశలో కొనసాగుతూ మే18-20తేదీల్లో బంగాళాఖాతం తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాలను మరో ఐదారు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

శుక్రవారం ఒడిశాలోని అన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చూడాలని చెప్పారు. దక్షిణ ప్రాంతంలోని, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలోని మత్స్య కార్మికులు వేటకు మే 15నుంచి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు. 

Read Here>> monsoon rains బ్యాడ్ న్యూస్ : ఆలస్యంగా రుతు పవనాలు