Abhiram : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ

దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా ఇవాళ దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్...

Abhiram : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ

Abhiram

Daggubati Abhiram :   ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీస్ లో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ నిర్మాతలుగా, హీరోలుగా సక్సెస్ అయ్యారు. తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తాజాగా ఇవాళ దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని అనౌన్స్ చేశారు.

ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త హీరోలని పరిచయం చేసిన డైరెక్టర్ తేజ అభిరామ్ ని కూడా హీరోగా పరిచయం చేయనున్నాడు. ఒకప్పుడు తేజ సినిమాలు లవ్, రా, రస్టిక్ గా ఉండేవి. అప్పుడు తేజ సినిమాలన్నీ బాగా ఆడేవి. కానీ ఇటీవల తేజ ఓల్డ్ స్టైల్ మిస్ అయింది. తేజ కూడా కమర్షియల్ అంశాల వైపు వెళ్లడంతో అపజయాలు ఎదుర్కొంటున్నాడు. దీంతో అభిరామ్ ని పరిచయం చేస్తూ మరోసారి తన ఓల్డ్ స్టైల్ లో సినిమా తీయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇవాళ డైరెక్టర్ తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి ‘అహింస’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో ఓకే గోనె సంచితో అభిరామ్ మొహం కట్టేసి బాగా రక్తం కారుతున్నట్టు చూపించారు. ఫస్ట్ లుక్ లో పూర్తిగా హింసని చూపిస్తూ అహింస టైటిల్ ని అనౌన్స్ చేయడం విశేషం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Puri Jagannadh : పూరి జగన్నాధ్ పాన్ వరల్డ్ సినిమా…

అయితే ఈ సినిమాని ఎప్పుడో ప్రారంభించేసి సైలెంట్ గా సినిమా షూట్ ని కూడా పూర్తి చేసేశారు. షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించనున్నారు. ఒకప్పుడు తేజ-ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ లో తేజ తన పాత పద్దతిలో వెళ్తూ అభిరామ్ హీరోగా ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

Radhika Sharath Kumar : అప్పటి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి ఈ సినిమాతో

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అహింస’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా మిగతా వివరాలని, రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. అయితే హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తెలీదు. ఇంత సైలెంట్ గా ఎవరికీ తెలీకుండా షూటింగ్ పూర్తి చేయడం విశేషం. మరి రానా సక్సెస్ అయినట్టు దగ్గుబాటి అభిరామ్ కూడా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి.