BRS Party Resolutions: దేశవ్యాప్తంగా దళితబంధు.. బీఆర్ఎస్ కీలక తీర్మానాలు ఇవే..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధుల సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.

BRS Party Resolutions: దేశవ్యాప్తంగా దళితబంధు.. బీఆర్ఎస్ కీలక తీర్మానాలు ఇవే..

BRS Party Delegates Meeting: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం తెలంగాణ భవన్ లో జరుగుతున్న ప్రతినిధుల సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటిఆర్ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. “వ్యవసాయాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానికి అనుగుణంగా దేశాన్ని, కేంద్రాన్ని జాగృతం చేసేలా పెద్ది సుదర్శన్ రెడ్డి.. నర్సంపేట నియోజకవర్గంలో పోస్ట్ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సుదర్శన్ రెడ్డికి అభినందనలు ” అని కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ తీర్మానాలు
దేశంలో రైతురాజ్యం స్థాపించాలని- ప్రతిరాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టు నిర్మించాలని తీర్మానం
24 గంటల పాటు దేశ వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే కొత్త పాలసీ అమలు చేయాలని తీర్మానం
మన దేశ బ్రాండ్ తో విదేశాలకు ఫుడ్ ప్రాడెక్టు లను ఎగుమతి చేయాలని తీర్మానం
దళితబందు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం

దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని తీర్మానం
దేశంలో బీసీ జనగణన జరపాలని తీర్మానం
దేశంలో ద్వేషాన్ని విడిచి… ప్రశాంతతకు దేశ పౌరులంతా ఏకం కావాలని తీర్మానం
దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు, పనిచేయాలని తీర్మానం