Green Card : అమెరికా గ్రీన్ కార్డుల జారీలో జాప్యం…పెండింగ్ లో లక్ష గ్రీన్ కార్డులు

అయితే ఇప్పటి వరకు జారీ చేసిన గ్రీన్ కార్డుల వివరాల సమాచారంపై అమెరికా విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్ హీం ఇచ్చిన సమాచారం అందరిని తీవ్రనిరాశకు గురిచేసింది.

Green Card : అమెరికా గ్రీన్ కార్డుల జారీలో జాప్యం…పెండింగ్ లో లక్ష గ్రీన్ కార్డులు

Green Card

Green Card : అమెరికాలో గ్రీన్ కార్డుల జారీ వ్యవహారంలో చోటుచేసుకుంటున్నజాప్యం, అగ్రరాజ్యంలో ఉంటున్న వీదేశీయులు అశలపై నీళ్ళు చల్లుతోంది. ఈ సంవత్సరం సుమారుల లక్ష గ్రీన్ కార్డులు వృధా కానున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా యూఎస్ సీఐఎస్ నిధుల సమస్యను ఎదుర్కొంటుంది. దీనికితోడు సిబ్బంది కొరత కార్డుల జారీ ప్రక్రియ నెమ్మదించటానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

అగ్రరాజ్యంలో ఇప్పటికే చాలా మంది విదేశీయులు ఈ ఏడాది గ్రీన్ కార్డులు జారీ అయితే శాశ్వతంగా అక్కడే ఉండేందుకు అవకాశం ఏర్పడుతుందన్న అకాంక్షతో ఉన్నారు. అలాంటి వారికి ప్రస్తుత సమాచారం తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు పర్యవేక్షించే యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సంస్ధ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి లక్షా 20వేల గ్రీన్ కార్డుల జారీ లక్ష్యాన్నిపెట్టుకుంది. రానున్న సెప్టెంబర్ నెలతో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది.

అయితే ఇప్పటి వరకు జారీ చేసిన గ్రీన్ కార్డుల వివరాల సమాచారంపై అమెరికా విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్ హీం ఇచ్చిన సమాచారం అందరిని తీవ్రనిరాశకు గురిచేసింది. సెప్టెంబర్ చివరినాటికి సుమారుగా లక్ష గ్రీన్ కార్డులు జారీ కాకుండా పెండింగ్ లో ఉండిపోనున్నట్లు చార్లీ చెప్పటంతో అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ కాకుంటే మళ్ళీ ఐదేళ్ళ వరకు గ్రీన్ కార్డు పొందటం కోసం నీరీక్షించాల్సి ఉంటుంది.

గ్రీన్ కార్డుల జారీలో నెలకొన్న జాప్యం కారణంగా ప్రధానంగా అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. కంట్రీ క్యాప్ అధారంగా గ్రీన్ కార్డులను అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న భారతదేశీయులకు ఇది ఒకరకంగా ఇబ్బంది కరమైన పరిస్ధితిగా చెప్పవచ్చు.