Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు.

Arvind Kejriwal: ఢిల్లీలో కూల్చివేతలు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

Arvind Kejriwal to centre

Arvind Kejriwal: ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు. 63 లక్షల ప్రజల నివాసాలు, షాపులపైకి బుల్డోజర్లను తీసుకొస్తున్నారని, స్వాతంత్ర్య భారత దేశంలో ఇదే అతిపెద్ద విధ్వంసమని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డిల్లీ (ఎమ్‌సీడీ) ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సోమవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమై చర్చించారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిర్మాణాలను కూల్చడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.

Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి

‘‘ఢిల్లీ ఒక ప్రణాళిక ప్రకారం నిర్మితమైన నగరం కాదు. ఢిల్లీలోని దాదాపు 80 శాతం నిర్మాణాలు అక్రమమే అయ్యుంటాయి. అయితే, యజమానుల దగ్గర సరైన పత్రాలు ఉన్నప్పుడు కూడా వాటిని కూల్చడం సరైంది కాదు. ఎమ్‌సీడీలో అధికార బీజేపీ దగ్గర పేదల ఇండ్లను కూల్చేందుకు ఒక ప్రణాళిక మాత్రం ఉంది. పదిహేనేళ్లుగా బీజేపీ ఢిల్లీ మున్సిపాలిటీలో అధికారంలో ఉంది. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు. లంచాలు తీసుకుని, అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు’’ అని విమర్శించారు. తాను కూడా అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకమే అయినా, వాటిని కూల్చడం మంచి పని కాదన్నారు. పేదలు, మురికి వాడల్లోని ఇండ్లను చట్టబద్ధం చేస్తామని, మురికి వాడల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు టైమ్ ఇస్తామన్నారు.