రైతన్నల ఉద్యమంలో ఆకట్టుకుంటున్న భారీ రోటీ మేకర్..గంటలో 2వేల రొట్టెలు రెడీ..

  • Published By: nagamani ,Published On : December 12, 2020 / 12:38 PM IST
రైతన్నల ఉద్యమంలో ఆకట్టుకుంటున్న భారీ రోటీ మేకర్..గంటలో 2వేల రొట్టెలు రెడీ..

Delhi : farmer protests roti machine : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్న రైతన్నల ఉద్యమంలో ఓ భారీ రోటీ మేకర్ ఆకట్టుకుంటోంది. రైతన్నల రోజు రోజుకు తీవ్ర తరమవుతోంది.ప్రభుత్వం వారి ఆందోళనలు విరమించటానికి ఎన్ని తాయిలాలు ఆశచూపినా వ్యవసాయం చట్టాన్ని మార్చేవరకూ ఉద్యమం ఆపేది లేదంటూ కలిసి కట్టుగా..ఒకే మాటపై ఉండి పోరాడుతున్నారు రైతన్నలు.

వేలాదిమంది రైతులు ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వీరంతా కలిసి సామూహిక వంటగదిని ఏర్పాటుచేసుకున్నారు. ఉత్తరాదివారు ఎక్కువగా రోటీలే తింటారు. రోటీ, చాయ్ లు వీరి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. ఈ క్రమంలో వేలాదిమంది రైతులు ఒకేమాట, ఒకే బాటగా నడుస్తున్నారు. అలాగే ఒకే వంటగదిలో చేసే వంటకాలు తింటున్నారు. వారి కష్టసుఖాలు పంచుకుంటున్నారు. రైతన్నల ఉద్యమంలో ప్రధానంగా ఓ భారీ ‘‘రోటీ మేకర్’’ ఆకట్టుకుంటోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..కొన్ని వారాలుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి అవసరమైన వంట సామగ్రిని తమతో పాటే తెచ్చుకున్నారు. ఇప్పుడు వంటల భారాన్ని తగ్గించడానికి భారీ రోటీ మేకర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఇది ఒక గంటలో సుమారు 1500 నుంచి 2000 చపాతీలను తయారుచేస్తోంది ఈరోటీ మేకర్. చలిలో వేడి వేడి రొట్టెలు తింటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు రైతన్నలు. ఢిల్లీ చుట్టుపక్కల ఉండే పలు రాష్ట్రాల నుంచి రైతులు భారీగా తరలి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు. వీరందరికీ ఒకేవంటగదిని ఏర్పాటు చేసుకుని వండివారుస్తున్నారు కొంతమంది రైతులు. ఈ వీడియోలు ఇప్పుడు social mediaలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న రోటీ మేకర్  వీడియో
కాగా..పెద్ద ఆలయాలు, గురుద్వారాలు, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ వంటి మందిరాల్లో వేలాది మందికి రోజూ అన్నదానం చేస్తారు. భక్తుల కోసం వందల సంఖ్యలో రోటీలు చేయాల్సి ఉంటుంది. అక్కడ రోటీ మేకర్‌ యంత్రాల ద్వారా చపాతీలు తయారుచేస్తారు. ప్రస్తుతం రైతుల శిభిరం నుంచి సోషల్ మీడియాలో వైరల్ రోటీ మేకర్‌ వీడియోలో చపాతీలు ఎలా కాలుస్తున్నారో కనిపిస్తోంది.

గోధుమపిండి కలిపి, ముద్దలుగా చేసి యంత్రంలో వేస్తే చాలు.. చక్కగా దోరగా కాలిన చపాతీలు యంత్రం నుంచి బయటకు వస్తున్నాయి. మెషిన్ లోపలే పిండి రొట్టెగా మారుతోంది. ఆ తరువాత ముందు భాగంలో ఉన్న మంటపై అవి ఉడికి బయటకు వస్తున్నాయి.

కాగా..గత సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హర్యాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ నుంచి వందల సంఖ్యలో రైతులు దిల్లీకి చేరుకున్నారు. నవంబర్ 26 నుంచి దిల్లీ ఐదు బోర్డర్లలో ఆందోళన చేస్తున్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది.

ఈ సంస్కరణలు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సింగు, తిక్రీ సరిహద్దులలో ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని నెలల వరకు తమకు సరిపోయే కిరాణా సరకులు, రేషన్‌ను కూడా వారితో తీసుకువచ్చారు. వేలాది మంది రైతులు రోజూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఖల్సా ఎయిడ్ ఫౌండేషన్‌ రైతులకు టీ, స్నాక్స్‌ వంటివి ఏర్పాటు చేస్తోంది. ఆ సంస్థే రైతుల శిభిరంలో మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసింది.