MLC Kavitha : కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్
సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. తమ వాదనలు వినకుండా ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తన పిటిషన్ లో ప్రస్తావించింది ఈడీ.(MLC Kavitha)

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులను విచారిస్తున్న ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తన పిటిషన్ లో ప్రస్తావించింది ఈడీ. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది ఈడీ. ఈ నెల 24న కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
మహిళల ఈడీ విచారణ కరెక్ట్ కాదంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పైనే ఇప్పుడు ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒకవేళ కవిత పిటిషన్ ను మార్చి 24న సుప్రీంకోర్టు కనుక విచారిస్తే.. ఆ విచారణ సందర్భంగా ఈడీ వాదనలు సైతం సుప్రీంకోర్టు వినాల్సి ఉంటుంది. ఏకపక్షంగా ఎలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వడానికి వీలుండదు.(MLC Kavitha)
MLC Kavitha Posters : హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్ల కలకలం.. ఈసారి కవితకు వ్యతిరేకంగా
మనీలాండరింగ్ కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మరోసారి విచారణకు రావాలని చెప్పింది. ఈ నెల 11న కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. 16న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చాక.. 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున, మార్చి 24వరకు తనకు గడువు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత.. ఈడీని కోరడం జరిగింది. అయినప్పటికీ కవిత అభ్యర్థనను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ మార్చి 20న నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో మార్చి 20న ఈడీ విచారణక కవిత హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో ఈడీ ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళల ఈడీ విచారణపైన 2018లో కూడా ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు తనను కూడా విచారణ పేరుతో ఈడీ వేధిస్తోందని, ముఖ్యంగా తన అనుమతి లేకుండా తన ఫోన్ సీజ్ చేశారు, తనకు ఎటువంటి సంబంధం లేని కేసుకి సంబంధించి ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాలను కూడా పిటిషన్ లో పేర్కొన్నారు కవిత.(MLC Kavitha)
Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత
ముందస్తు అరెస్టులు, ఇతర కఠిన నిర్ణయాలు ఏవీ దర్యాఫ్తు సంస్థ ఈడీ తీసుకోకుండా.. ఈ నోటీసులను నిలుపుదల చేసే విధంగా చూడాలని చెప్పి సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ముందస్తు ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.