Delhi Air Quality Worsened : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. మరింత క్షీణించిన గాలి నాణ్యత

ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇవాళ గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఉదయం ఢిల్లీ అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయి రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Delhi Air Quality Worsened : ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. మరింత క్షీణించిన గాలి నాణ్యత

Delhi air quality worsened

Delhi air quality worsened : ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇవాళ గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఉదయం ఢిల్లీ అంతటా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ఈ పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా పడిపోయి రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత మరింత పడిపోవడం కూడా నగరంపై పొగమంచు దట్టంగా కమ్ముడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో ఇవాళ సగటు గాలి నాణ్యత రికార్డు స్థాయిలో 317కు పడిపోయింది. ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ ఏరియాల్లో AQI 311గా ఉంది. లోధి రోడ్‌ ఏరియాలో కాస్త తక్కువగా 303 ఉంది. మథుర రోడ్‌లో అత్యధికంగా 332 స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో 334గా నమోదైంది.

Delhi Air Pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఎన్సీఆర్ ప్రజలు

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం. AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉన్నట్లు. AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని అర్థం. AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థమని అధికారులు వెల్లడించారు.