Jeevitha Rajasekhar: తప్పు చేయలేదు.. నేనెక్కడికీ పారిపోలేదు..

తమ మీద కొందరు పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశమైన తమను లాగుతున్నారని జీవిత రాజశేఖర్ వాపోయారు..

Jeevitha Rajasekhar: తప్పు చేయలేదు.. నేనెక్కడికీ పారిపోలేదు..

Jeevitha Rajasekhar: తమ మీద కొందరు పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సినిమా రంగానికి సంబంధించిన ఏ అంశమైన తమను లాగుతున్నారని జీవిత రాజశేఖర్ వాపోయారు. కొద్దిరోజులుగా వారిపై వస్తున్న ఆరోపణలను జీవిత ఖండించారు. తామేమీ తప్పు చేయలేదని, నేనెక్కడికీ పారిపోలేదని జీవిత స్పష్టం చేశారు. వారెంట్ వచ్చింది నిజమేనని, సమన్లు మాకు అందలేదని, అందకుండా చేశారని అన్నారు. కోర్టు సమను వచ్చి రెండు నెలలు అవుతుందని, ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావటం లేదని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు.

Jeevitha on MAA: ‘మా’లో.. మళ్లీ అదే జరుగుతోంది!

కోర్టులో అన్ని విషయలు బయటకు వస్తాయని, తప్పుచేయని మేము ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం ఏమిటని అన్నారు. కచ్చితంగా న్యాయం కోసం ఎంతవరకు అయిన వెళ్తామని తెలిపారు. మా లైఫ్ లో మంచి చెడ్డ వాళ్ళతో ట్రావెల్ అవుతామని, వచ్చిన ప్రతి ఆరోపణ మేము చేసినట్లు కాదని అన్నారు. 26కోట్లు అన్నారని, అవిడబ్బులా..? లేక వేసుకొనే కోట్లా? అని జీవిత ప్రశ్నించారు.

Delhi Covid : ఢిల్లీలో కరోనా భయం.. మళ్లీ నిబంధనలు

నేను దాక్కో లేదని, తిరుగుతూనే వున్నానని అన్నారు. కోటేశ్వర రాజు మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, తామంటే నచ్చని వారెవరో వెనక ఉండి ఇలాంటి పనులు చేస్తుంటారని జీవిత చెప్పారు. ఓవర్ యాంబిషన్ కారణంగా కోటేశ్వరరాజు ఇలా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తోందని, ఆయన ఎవరి దగ్గరో చేసిన అప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్లుందని జీవిత పేర్కొన్నారు. కొంతకాలంగా మీడియా ఎక్కువగా తమను టార్గెట్ చేస్తోందని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు.