Venkatesh : వెంకటేష్‌తో స్వామి వివేకానంద సిరీస్.. వెంకటేష్ ఒప్పుకున్నారు కానీ..

సర్కిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నీలకంఠ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. తెలుగులో ఇప్పటివరకు స్వామి వివేకానంద గురించి సినిమాలు, సిరీస్ లు రాలేదు.

Venkatesh : వెంకటేష్‌తో స్వామి వివేకానంద సిరీస్.. వెంకటేష్ ఒప్పుకున్నారు కానీ..

Director Neelakanta planned Swami Vivekananda series with venkatesh but project shelved

Swami Vivekananda :  షో, మిస్సమ్మ, విరోధి లాంటి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ నీలకంఠ దాదాపు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నీలకంఠ తీసిన ‘సర్కిల్’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. సాయి రోనాక్, రిచా పనయ్, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ ముఖ్య పాత్రల్లో సర్కిల్ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

సర్కిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నీలకంఠ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు. నీలకంఠ దాదాపు కొత్తవాళ్లు, చిన్న హీరోలతోనే సినిమాలు తీశారు. స్టార్ హీరోలతో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. దాని గురించి కూడా స్పందించారు.

డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ.. గతంలో వెంకటేష్ తో వివేకానంద స్వామి సిరీస్ తీయాలని అనుకున్నాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ సిరీస్ ఆగిపోయింది. కథ కుదిరి, హీరోలు ఒప్పుకుంటే స్టార్ హీరోలతో కచ్చితంగా సినిమాలు చేస్తాను. నా సినిమాలన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఉంటాయి. థియేటర్ కి జనాలు వచ్చి చూస్తే చాలు అదే నేను పెద్ద అవార్డుగా భావిస్తాను. త్వరలో వెబ్ సిరీస్ లు తీయడానికే ప్లాన్ చేస్తున్నాను. అందుకోసం రెండు కాన్సెప్ట్స్ కూడా సిద్ధం చేసుకున్నాను అని తెలిపారు.

SK21 : క‌శ్మీర్‌లో సాయిప‌ల్ల‌వి.. ఫోటోలు వైర‌ల్‌.. ఏం చేస్తుందంటే..?

దీంతో వెంకటేష్ వివేకానంద సిరీస్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. వెంకటేష్ కి కొంచెం భక్తి ఎక్కువే, తన సోషల్ మీడియాలో కూడా రోజు మోటివేషనల్ కొటేషన్స్ పెడుతూ ఉంటారు. తెలుగులో ఇప్పటివరకు స్వామి వివేకానంద గురించి సినిమాలు, సిరీస్ లు రాలేదు. మరి భవిష్యత్తులో అయినా ఈ ప్రాజెక్టు అవుతుందో లేదో చూడాలి.