Indian Cinema : ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్..

సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి ప్రేక్షకుడిని అందులో ఇన్వాల్స్ చేయడంలో మార్వెల్ స్టూడియోస్ దే ఇప్పటివరకు పైచేయి. ఓ సినిమాతో మరో సినిమాకు ఇంటర్ లింక్ ఇస్తూ అవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్, థోర్, స్పైడర్ మ్యాన్........................

Indian Cinema : ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్..

Indian Cinematic Univers

Indian Cinema :  సినిమాటిక్ యూనివర్స్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు క్రేజీ డైరెక్టర్స్. సూపర్ హిట్టైన మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకుని కొత్త స్టోరీతో, సరికొత్త హీరోను పరిచయం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమాలపైనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. హాలీవుడ్ హిట్ ఫార్ములా మార్వెల్, డీసీ యూనివర్స్ తరహాలో ఇండియన్ సినిమాలు రాబోతున్నాయి.

సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి ప్రేక్షకుడిని అందులో ఇన్వాల్స్ చేయడంలో మార్వెల్ స్టూడియోస్ దే ఇప్పటివరకు పైచేయి. ఓ సినిమాతో మరో సినిమాకు ఇంటర్ లింక్ ఇస్తూ అవెంజర్స్, డాక్టర్ స్ట్రేంజ్, థోర్, స్పైడర్ మ్యాన్ లాంటి చాలా సినిమాలను చూపించింది మార్వెల్. ఓ కథలో క్యారెక్టర్ చిన్నగా కనిపించినా నెక్ట్స్ ప్రాజెక్ట్ లో అదే క్యారెక్టర్ మెయిన్ లీడ్ గా మారుతుంది. మరో కథ పుడుతుంది. మరో సినిమా అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ను తనవైపుకు తిప్పుకుంది మార్వెల్.

మార్వెల్ తరహాలో సినిమాటిక్ యూనివర్స్ చూపించేందుకు ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే స్టోరీ లైన్స్ తో సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పై చర్చ భీభత్సంగా సాగుతోంది. విక్రమ్ సినిమాతో సృష్టించిన మ్యానియా ఇప్పట్లో వదిలేలా లేదు. ఎక్స్ పాండ‌బుల్స్ లాంటి క్రేజీ యూనివ‌ర్స్ క్రియేట్ చేసిన డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ అందులో హీరోగా క‌మ‌ల్ హాస‌న్ ను ఇంట్రడ్యూస్ చేసి సీక్వెల్స్ కావాల్సిన లైనప్ రెడీ చేసాడు.

క‌మల్ తో పాటూ విజ‌య్ సేతుప‌తి, ఫహాద్ ఫాజ‌ిల్ న‌టించిన విక్ర‌మ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ గా సూర్య క‌నిపించ‌డంతోనే విక్ర‌మ్2 సీక్వెల్ మీద వ‌ర్క్ స్టార్ట్ అయిన‌ట్లు తెలిసిపోయింది. ఆసక్తిగా విక్రమ్ ను చూపించి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసాడు లోకేష్. సీక్వెల్ లో ఎవరు విలనో చెప్పకనే చెప్పేసాడు. అంతేకాజు ఖైదీ క్యారెక్టర్ విక్రమ్ తో కలవబోతుంది. విక్రమ్ సీక్వెల్ లో కార్తీ సెకండ్ లీడ్ గా నటిస్తాడు. అంటే ఖైదీ యూనివర్స్ లో భాగంగా విక్రమ్ మారనుంది.

విక్రమ్, ఖైదీలను మిక్స్ చేసి కొత్త కథను తెరపై చూపించబోతున్నాడు లోకేశ్. ఉన్న హీరోలు ఉండగానే కొత్త క్యారెక్టర్స్ కూడా రాబోయే సినిమాల్లో పుట్టుకొస్తాయి. అయితే విక్రమ్ 2తో పాటూ విక్రమ్ 3 షూటింగ్ కూడా అల్టర్ నేటివ్ గా జరగనుందని సమాచారం. అవతార్ సీక్వెల్స్ లా ఒకేసారి షూటింగ్ పూర్తి చేసి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఖైదీలో అర్జున్ దాస్ పాత్ర చనిపోయిందని జనం అనుకున్నారు. కానీ విక్రమ్ లో బతికే ఉన్నట్టు చూపించారు. దీనికి సమాధానంగా అన్బుకు కేవలం గాయమైందన్న లోకేశ్ ఖైదీ2లో మరింత వివరంగా చూపిస్తామన్నాడు. దీనిని బట్టి ఖైదీ2 కు ముహూర్తం ముందు ఫిక్స్ చేసేలా ఉన్నారు.

ఖైదీ2లో విక్రమ్ ఛాయలు కనిపించనున్నాయి. ఖైదీ 2లో ఖచ్చితంగా విక్రమ్ లో కనిపించిన సూర్య రోలెక్స్ రోల్ ఎక్కువ ఉండబోతుందని టాక్. ఇక ఆ మధ్య ఓ స్టోరీ లైన్ వినిపించేందుకు రామ్ చరణ్ ను కలిసాడు లోకేశ్ కనగరాజ్. చరణ్ విన్న కథ కూడా విక్రమ్ స్టోరీతో లింక్ అయి ఉంటుందని అంటున్నారు. విక్రమ్ లో కనిపించిన చిన్న బాబు పెద్దయ్యాక రామ్ చరణ్ లా మారుతాడని, మరో కొత్త స్టోరీ లైన్లో లోకేశ్ – చరణ్ ల సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

లోకేశ్ కనగరాజ్ కన్నా ముందు తాను ఓ సినిమాటిక్ యూనివర్స్ చూపించబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ లో భాగంగా కొత్త కొత్త హీరోలు పుట్టుకురానున్నట్టు హింట్ ఇచ్చాడు. KGF ఫ్రాంచైజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసాడు ప్రశాంత్ నీల్. కామ్ గా ఎంట్రీ ఇచ్చి KGF 1తో ప్రేక్షకులను ఎదురుచూసేలా చేసి కేజీఎఫ్2తో నేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఈ మూవీతో ఎన్నో అనుమానాలను ప్రేక్షకుల్లో కలిగించాడు. కేజీఎఫ్3 కూడా ఉండబోతుందని చెప్పేసాడు. రాఖీభాయ్ బ్రతికే ఉంటాడా 1978 నుంచి 81 మధ్యలో ఏం జరిగింది, నారాచి నుంచి మరో కొత్త హీరో బయటికొస్తాడా అన్న ప్రశ్నలతో కేజీఎఫ్3పై ఇప్పటినుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసాడు.

1500 కోట్ల బడ్జెట్ తో కేజీఎఫ్3 ను లాక్ చేసారని సమాచారం. బడ్జెట్ కి తగ్గ స్థాయి రిజ‌ల్ట్స్ రావాలంటే నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న స్టార్స్ కావాలి. అందుకే ప్రశాంత్ నీల్ చాప్టర్ 3లో, హీరో హృతిక్ ను రాకీభాయ్ కి తోడుగా దింపుతున్నాడన్న‌దేది లేటెస్ట్ బజ్. అయితే ఈ 2022లో కేజీయఫ్‌-3 ఉండదని, హృతిక్‌ నటిస్తాడో లేడో కూడా ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు ప్రొడ్యుసర్‌ విజయ్‌ కిరంగదూర్‌. ఒకవేళ హృతిక్ ఎస్ అంటే మాత్రం అభిమానులకు పండగే. యశ్ కేజీఎఫ్ నుంచి హృతిక్ లాంటి మరో హీరో పుట్టుకొస్తే అది అల్టిమేట్ అన్నట్టే.

Pawan Klayan : మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలకి బ్రేక్ ఇస్తారా??

ఇక కేజీఎఫ్2 నుంచే సలార్ సినిమా స్టార్ట్ అవుతుందనే టాక్ కూడా ఉంది. చాప్టర్ 2 లో ప్రశాంత్ నీల్ స్పెషల్ ఫోకస్ చేసిన క్యారెక్టర్ ఫర్మాన్ ది. ఈ ఫర్మాన్ క్యారెక్టరే సలార్ గా మారుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నారాచి ఫర్మాన్ సలార్ గా మారనున్నాడని సమాచారం. చాప్టర్ 2లో ఫర్మాన్ కి తల్లిగా కనిపించిన ఈశ్వరీరావే సలార్ లో ప్రభాస్ అమ్మగా నటించడం, ప్రభాస్ లుక్ ఫర్మాన్ క్యారెక్టర్ తో పోలి ఉండటం అది నిజమేనేమో అనేలా చేస్తోంది.

బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్ సినిమాటిక్ యూనివర్స్ పై కామెంట్స్ చేసాడు. మార్వెల్ లా మనమూ ఓన్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. మన పురాణాలు, కథలు ఇలాంటి సినీ ప్రపంచానికి పనికొస్తాయన్నది రణబీర్ వర్షన్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త కూడా అలాంటిదే. మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న బ్రహ్మాస్త్రలో ఫస్ట్ పార్ట్ శివగా రానుంది. సెకండ్, థర్డ్ పార్టుల్లో బ్రహ్మాస్త్రనే మెయిన్ థీమ్ అయినా కథ కొత్తగా ఉండనుంది.

Sukruthi : కేరింత నటి నిశితార్థం.. త్వరలోనే పెళ్లి..

 

బాహుబలితో పాన్ ఇండియా రుచి చూపించిన రాజమౌళి మాత్రం ఓన్ యూనివర్స్ ఆలోచనలకు దూరంగా ఉన్నారు. బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో మార్వెల్ గురించి ఎదురైన ప్రశ్నకు మార్వెల్ మూవీస్ పై తనకు పట్టులేదని చెప్పిన రాజమౌళి వాటిని ప్రేక్షకుడిగానే ఆస్వాదిస్తానన్నారు. వీలైతే ఇక్కడి కథల్నే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకొస్తానని అంతకు మించి అనిపించేలా ప్రాజెక్టుల విషయంలో ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. మొత్తానికి మన ఇండియా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎదుగుతున్న టైంలో మనం కూడా ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ లు తీస్తే హాలీవుడ్ కి గట్టి పోటీ ఇచ్చినట్టే.