Sukruthi : కేరింత నటి నిశితార్థం.. త్వరలోనే పెళ్లి..

 2015లో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీ దివ్య హీరోయిన్ అయినా మరో నటి సుకృతికి బాగా పేరొచ్చింది. సుకృతి అంటే.................

Sukruthi : కేరింత నటి నిశితార్థం.. త్వరలోనే పెళ్లి..

Sukruthi

Sukruthi :  2015లో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీ దివ్య హీరోయిన్ అయినా మరో నటి సుకృతికి బాగా పేరొచ్చింది. సుకృతి అంటే ఎవరు గుర్తు పట్టకపోవచ్చు కానీ ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు భావన అంటే అందరూ గుర్తుపడతారు. భావన క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది నటి సుకృతి.

ఆ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకి మాత్రం దూరంగానే ఉంది. ఎందుకు అనే కారణాలు ఎవ్వరికి తెలీవు. అయితే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది సుకృతి. త్వరలో ఈ భామ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా సుకృతికి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశితార్థం జరిగింది.

Pratysha Garimella : తన మరణం నన్ను బాధిస్తుంది.. ప్రత్యూష ఆత్మహత్యపై ఉపాసన ఎమోషనల్ పోస్ట్..

ఈ నిశితార్థంకి సంబందించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఈ జంట ఇద్దరూ కలిసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ జంటకి. నిశితార్థం సందర్భంగా తన నాన్న గురించి కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది సుకృతి.

View this post on Instagram

A post shared by Akshay Singh (@singhakshay)