Nirmaan Org: సైబరాబాద్ కమిషనరేట్‌ పోలీసులకు 1200 రెయిన్‌కోట్‌ల పంపిణీ

ఈ కార్యక్రమం ఇనార్బిట్ కేర్స్ కింద ‘స్టే ఇన్‌లేన్’ అని పిలువబడే ఈ సహకార ప్రచారంలో భాగంగా అధికారులకు 1200 ప్రకాశవంతమైన పసుపు రంగు రెయిన్‌కోట్‌లను వారి సౌలభ్యం, భద్రత సంసిద్ధతతో వారు తమ విధిని నిర్వర్తించడం, సవాలు పరిస్థితులలో పౌరులకు సౌకర్యాన్ని అందించడం కోసం పంపిణీ చేసింది

Nirmaan Org: సైబరాబాద్ కమిషనరేట్‌ పోలీసులకు 1200 రెయిన్‌కోట్‌ల పంపిణీ

Cyberabad Commissionerate: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నందున, ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్‌ను నిర్వహిస్తూ ప్రజలకు సహాయం చేయడానికి ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారి కృషిని అంకితభావాన్ని గుర్తించి, ఇనార్బిట్ మాల్, BITS పిలానీ విద్యార్థులు ప్రారంభించిన నమోదిత Nirmaan.org అనే ఆర్గనైజేషన్ తాజాగా సైబరాబాద్ కమిషనరేట్‌లో 1200 రెయిన్‌కోట్‌లను అందజేశాయి.

Manipur Violence: మణిపూర్‭లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ మీద నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. కానీ కండిషన్స్ అప్లై

ఈ కార్యక్రమం ఇనార్బిట్ కేర్స్ కింద ‘స్టే ఇన్‌లేన్’ అని పిలువబడే ఈ సహకార ప్రచారంలో భాగంగా అధికారులకు 1200 ప్రకాశవంతమైన పసుపు రంగు రెయిన్‌కోట్‌లను వారి సౌలభ్యం, భద్రత సంసిద్ధతతో వారు తమ విధిని నిర్వర్తించడం, సవాలు పరిస్థితులలో పౌరులకు సౌకర్యాన్ని అందించడం కోసం పంపిణీ చేసింది. కాగా, ఈ విషయమై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ “ఇనార్బిట్ మాల్, కె.రహేజా కార్ప్ నిర్మాణ్.ఆర్గ్ అందించిన అమూల్యమైన సహకారానికి మేము మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మా ట్రాఫిక్ పోలీసులకు రెయిన్‌కోట్‌లను అందించడంలో వారి ప్రయత్నం నిజంగా అభినందనీయం” అని అన్నారు.