Manipur Violence: మణిపూర్‭లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ మీద నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. కానీ కండిషన్స్ అప్లై

బ్రాడ్‌బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్‌ని తొలగించాల్సి ఉంటుంది

Manipur Violence: మణిపూర్‭లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ మీద నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. కానీ కండిషన్స్ అప్లై

Internet Ban: అటు ఇటుగా మూడు నెలల తర్వాత మణిపూర్ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. అయితే అవి కూడా పాక్షికంగానే. అంటే కేవలం బ్రాడ్‭బాండ్ సేవలపై మాత్రమే నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ మొబైల్ డేటాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయలేదు. క్రమక్రమంగా ఈ నిషేధాన్ని పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తోందట. ఇందులో భాగంగా మంగళవారం తొలిదశ ఎత్తివేతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.

Rajasthan Politics: ఎర్ర డైరీతో అసెంబ్లీకి వచ్చి గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన రాజేంద్ర గూడా.. ఎవరీ రాజేంద్ర గూడా, ఆ డైరీలో ఏముంది?

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, నిర్దిష్ట షరతులపై బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను మంగళవారంనాడు పునరుద్ధంచారు. యూజర్లు తప్పనిసరిగా అండర్‌టేకింగ్‌పై సంతకం చేయాల్సి ఉంటుందని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్థిరమైన ఒకే ఒక్క ఐపీ కనెక్షన్ (static IP connection) ఉన్న ఇంటర్నెట్ పరిమితంగా వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మాత్రం యథావిథిగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఇక సోషల్ మీడియా వినియోగానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని స్పష్టం చేసింది.

China Politics: విదేశాంగ మంత్రి మిస్సింగ్ మిస్టరీగానే ఉంది. అంతలోనే కొత్త మంత్రిని నియమించిన చైనా

బ్రాడ్‌బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. ఏదైనా డివైజ్‌కి స్థిరమైన ఐపీ కేటాయిస్తే అది మారదు. ఎక్కువ డివైజ్‌లలో డైనమిక్ ఐపీలను వాడుతుంటారు. నెట్‌వర్క్‌కు కనెక్టవ్వడం ద్వారా అసైన్ అయితే ఈ ఐపీ మారుతుంటుంది. కాబట్టి స్థిరమైన ఐపీ ఏదో సులభంగా పర్యవేక్షించి గుర్తించవచ్చు. ఇక వైఫై హాట్‌స్పాట్‌లకు కూడా అనుమతి లేదు. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (VPN) సాఫ్ట్‌వేర్‌ని తొలగించాల్సి ఉంటుంది. ఇక కొత్త వాటిని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీల్లేదని మణిపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.