telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ (కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం) రావాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు.

telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్

telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ (కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం) రావాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మహేంద్ర నాథ్ పాండే మీడియా సమావేశం నిర్వ‌హించి మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాల‌ని ఆయ‌న చెప్పారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజక వర్గానికి ప్రతినిధులు వచ్చారని, తాను కూడా వచ్చానని తెలిపారు.

Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఫ‌డ్న‌వీస్‌పై మోదీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ఇంతకు ముందు కూడా ఒకసారి తెలంగాణలోని నిజామాబాద్‌కు వచ్చానని అన్నారు. తెలంగాణ న‌లుగురు బీజేపీ నేత‌లు ఎంపీలుగా గెలిచారని ఆయ‌న గుర్తు చేశారు. ఆ సంఖ్య భ‌విష్య‌త్తులో ఇంకా పెరుగుతుంద‌ని చెప్పారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ మంచి విజన్ ఉన్న గొప్ప వ్యక్తి అని ఆయ‌న అన్నారు.