Road Roller: నడిపిస్తున్న రోడ్ రోలర్ కిందనే పడి మృతి చెందిన డ్రైవర్

తాను నడుపుతున్న రోడ్ రోలర్ కిందనే పడి ప్రాణాలు విడిచాడు డ్రైవర్. ఉత్తరప్రదేశ్ లోని గోపీగంజ్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 40సంవత్సరాల వయస్సున్న జయశంకర్ యాదవ్ కొంతకాలంగా..

Road Roller: నడిపిస్తున్న రోడ్ రోలర్ కిందనే పడి మృతి చెందిన డ్రైవర్

Raod Roller

Updated On : April 10, 2022 / 8:56 PM IST

Road Roller: తాను నడుపుతున్న రోడ్ రోలర్ కిందనే పడి ప్రాణాలు విడిచాడు డ్రైవర్. ఉత్తరప్రదేశ్ లోని గోపీగంజ్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 40సంవత్సరాల వయస్సున్న జయశంకర్ యాదవ్ కొంతకాలంగా అదే వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే వాహనం నడుపుతుండగా.. హైటెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ వాహనం కిందపడింది. దాంతో బ్యాలెన్స్ తప్పిన జయశంకర్.. బ్యాలెన్స్ కోల్పోయాడు.

లోకల్ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో శంకర్ కాంట్రాక్చువల్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. గోపీగంజ్ లోని రూరల్ రోడ్ ప్రాజెక్టులో పనిచేస్తుండగా ఘటన జరగడంతో అతనితో పాటు పనిచేస్తున్న జోగేంద్ర అనే వ్యక్తి కాపాడబోయి గాయాలపాలయ్యాడు.

‘శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. తాను నడిపిస్తున్న రోడ్ రోలర్ కిందనే పడి యాదవ్ చనిపోయాడు. రోడ్ రోలర్ పై హైటెన్షన్ వైర్ పడటంతో బ్యాలెన్స్ కోల్పోయి.. అదే రోలర్ కిందపడి మృతి చెందాడు’ అని గోపీగంజ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బ్రిజేష్ సింగ్ అన్నారు.

Read Also : రోడ్ రోలర్ పై వచ్చిన పెళ్లికొడుకు