వైవిధ్యం ఎక్కువైందే : రోడ్ రోలర్ పై వచ్చిన పెళ్లికొడుకు

పెళ్లి వేడుకల్లో సాంప్రదాయ పద్ధతిలో ముస్తాబై చక్కగా పట్టు వస్త్రాలు ధరించి పెళ్లికొడుకు గుర్రంపై రావడం చూశాం. సైకిల్ మీద రావడం చూశాం. కారులో రావడమూ చూశాం. రోడ్డు రోల్ పై రావడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి.

  • Published By: sreehari ,Published On : January 31, 2019 / 01:08 PM IST
వైవిధ్యం ఎక్కువైందే : రోడ్ రోలర్ పై వచ్చిన పెళ్లికొడుకు

పెళ్లి వేడుకల్లో సాంప్రదాయ పద్ధతిలో ముస్తాబై చక్కగా పట్టు వస్త్రాలు ధరించి పెళ్లికొడుకు గుర్రంపై రావడం చూశాం. సైకిల్ మీద రావడం చూశాం. కారులో రావడమూ చూశాం. రోడ్డు రోల్ పై రావడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి.

పెళ్లి వేడుకల్లో సాంప్రదాయ పద్ధతిలో ముస్తాబై చక్కగా పట్టు వస్త్రాలు ధరించి పెళ్లికొడుకు గుర్రంపై రావడం చూశాం. సైకిల్ మీద రావడం చూశాం. కారులో రావడమూ చూశాం. రోడ్డు రోల్ పై రావడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి. అందరిలా పెళ్లి చేసుకుంటే మజా ఏముంటుందిలే అనుకున్నాడేమో ఇలా వినూత్నంగా పెళ్లి మండపానికి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడో పశ్చిమ బెంగాల్ వాసి. రోడ్ రోలర్ పై పెళ్లికొడుకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నదియా జిల్లాలోని క్రిష్ణానగర్ కు చెందిన ఆర్క పత్రా అనే 30ఏళ్ల వ్యక్తి తన పెళ్లిని అందరికి ఎక్కువగా కాలం గుర్తుండి పోయేలా చేసుకోవాలనుకున్నాడు.

అందుకే పెళ్లి మండపానికి వెళ్లే ముందు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండాలని భావించాడు. కుర్తా, దోతి ధరించి పూలమాలతో పెళ్లికొడుకు గెటప్ లో బ్యాండ్ భాజాతో ఇలా రోడ్ రోలర్ పై వచ్చాడు. పెళ్లి వేదిక దగ్గరకు చేరుకోగానే అక్కడి అతిథులంతా ఆర్కను చూసి అవాక్కయ్యారు. రోడ్ రోలర్ పై నుంచి దిగొచ్చి పెళ్లిపీటలపై పెళ్లికూతురికి తాళి కట్టాడు. ఫేస్ బుక్ లో పోస్టు చేసిన క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సెటైర్లు పేలుస్తున్నారు. బెంగాలీ పెళ్లికొడుకా మజాకా.. పిచ్చి పీక్స్ కు వెళ్తే ఇలాంటి ఐడియాలే వస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..