Sita Ramam: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సీతా రామం’!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతా రామం’ ఇప్పటికే తెలుగులో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.

Sita Ramam: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సీతా రామం’!

Sita Ramam: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతా రామం’ ఇప్పటికే తెలుగులో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sita Ramam : సీతారామం ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ల మధ్య సాగే లవ్‌ట్రాక్ చాలా క్లాసిక్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు హను రాఘవపూడి. కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.

Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!

ఈ సినిమాలోని లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక సోల్జర్ పాత్రలో దుల్కర్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని, అటు మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ కేమియో పాత్రలో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం ఆమె అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.