ED seized Gold from Musaddilal Showroom : ముసద్దీలాల్ జ్యువెల్లరీ షోరూంలో వందల కోట్ల విలువైన బంగారం,వజ్రాలు సీజ్

ED seized Gold from Musaddilal Showroom :  ముసద్దీలాల్ జ్యువెల్లరీ షోరూంలో వందల కోట్ల విలువైన బంగారం,వజ్రాలు సీజ్

ED seized huge gold from Musaddilal Gems and Jewelery Showroom

ED seized huge gold and from Musaddilal Gems and Jewelery Showroom : తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండో రోజు కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఎర్రమంజిల్ ముసద్దిలాల్ జేమ్స్ అండ్ జ్యువెల్లరీ షోరూంలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు ఈడీ అధికారులు. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్( ఎంఎంటీసీ) నుంచి ముసద్దిలాల్ సంస్థ రూ.504 కోట్ల విలువైన బంగారం తీసుకుంది. ఈ బంగారానికి డబ్బులు చెల్లించలేదు.దీంతో ఎంఎంటీసీ ముసద్దిలాల్ సంస్థకు వన్ టైమ్ సెటిల్ మెంటకు అవకాశం ఇచ్చింది.

అయినా సదరు సంస్థ డబ్బులు సెటిల్ చేయలేదు. ఆగోల్డ్ ను అమ్మి లాభాలను ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లుగా ఎంఎంటీసీ గుర్తించింది. దీంతో డబ్బులు సెటిల్ చేయకపోగా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టటంతో ఎంఎంటీసీ ఈడీకి ఫిర్యాదు చేసింది. దీంతో ముసద్దిలాల్ షోరూంలలో తనిఖీలు చేపట్టింది.

హైదరాబాద్ లోని ఎంబిఎస్, ముసద్దీలాల్ జేమ్స్ జ్యువెల్లరీ షోరూంల్లో రెండురోజుల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా బంగారాన్ని, వజ్రాలను సీజ్ చేశారు. వీటి విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. కాగా 2021లో ఈడీ ఇదే సంస్థకు చెందిన రూ.300ల కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది.