Ek Mini Katha: ‘ఐ హేట్ మై లైఫు.. కష్టాలకే కేరాఫు’.. ట్రైలర్ కిరాక్ ఉందిగా..!

ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటూ అంత‌టా అనూహ్య స్పంద‌న అందుకుంటోంది. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో క‌మెడియ‌న్ సుద‌ర్శన్ చెప్పిన పంచ్ డైలాగ్‌లు, హీరో సంతోష్ ప‌లికించిన హావ‌భావాలు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి..

Ek Mini Katha: ‘ఐ హేట్ మై లైఫు.. కష్టాలకే కేరాఫు’.. ట్రైలర్ కిరాక్ ఉందిగా..!

Ek Mini

Ek Mini Katha: అమెజాన్ ప్రైమ్ వీడియో స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ‘ఏక్ మినీ క‌థ’ మూవీ మే 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప‌ద్ధ‌తిలో విడుద‌ల అవుతున్న సంగతి తెలిసిందే. బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు.. అందుకే సినిమాలు కూడా విడుదల చేయడం లేదు.. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు.. అందుకే మా సినిమాను మే 27న విడుదల అమెజాన్‌లో విడుద‌ల‌ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఏక్ మినీ క‌థ’ ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేశారు.

Ek Mini Katha

యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌గా ‘ఏక్ మినీ క‌థ’ ఆడియెన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌నుంది. ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటూ అంత‌టా అనూహ్య స్పంద‌న అందుకుంటోంది. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో క‌మెడియ‌న్ సుద‌ర్శన్ చెప్పిన పంచ్ డైలాగ్‌లు, హీరో సంతోష్ ప‌లికించిన హావ‌భావాలు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి.
కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్.. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు.

ఈ బ్యాన‌ర్‌లోనే ‘ఏక్ మినీ కథ’ సినిమా నిర్మాణం పూర్తి అయింది. ‘పేపర్ బాయ్’ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తించారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ లక్కరాజు సంగీతం, సత్య ఎడిటింగ్ చేశారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ‘ఏక్ మినీ కథ’ యూనిట్.