Enemy : ‘నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే.. ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు’..

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’..

Enemy : ‘నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే.. ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు’..

Enemy

Enemy: యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ

నంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ బ్యానర్ మీద వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ పూర్త‌య్యింది. విశాల్‌, ఆర్య అభిమానులు, మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎనిమి’ టీజ‌ర్‌ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. స్టైలిష్ లుక్‌లో విశాల్ ఎంట్రీతో ప్రారంభమైన ఒక నిమిషం న‌ల‌భై సెకన్ల డ్యూరేషన్ గల ఈ టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

విశాల్, ఆర్య‌ల హై ఓల్టేజ్ యాక్ష‌న్ ప్యాక్డ్‌ పర్ఫార్మెన్స్‌లు హైలెట్‌గా నిలిచాయి. ఇక టీజ‌ర్ చివ‌ర్లో ‘ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే..’ అని ప్ర‌కాష్ రాజ్ చెప్పే డైలాగ్ ఈ టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ఆర్‌.డి. రాజశేఖర్ విజువ‌ల్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. సెప్టెంబ‌రులో తెలుగు, తమిళ్, హిందీ స‌హా మరికొన్ని భాషలలో ‘ఎనిమి’ భారీ స్థాయిలో విడుదల కానుంది.