Epf : ఈపీఎఫ్ ఖాతాల్లో త్వరలో వడ్డీ జమచేయనున్న ఈపీఎఫ్ఓ

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ శాతం 8.5శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

Epf : ఈపీఎఫ్ ఖాతాల్లో త్వరలో వడ్డీ జమచేయనున్న ఈపీఎఫ్ఓ

Epf

Epf : జులై నెలాఖరులోగా ఈఫీఎఫ్ వడ్డీని జమ చేసేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిద్ధమౌతుంది. ప్రస్తుతం 8.5శాతం ఈపీఎఫ్ వడ్డీ చొప్పున 6కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమచేయనుంది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ శాతం 8.5శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగిస్తుంది.

గత ఏడేళ్ళ కాలంతో పోలిస్తే ఈపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం చాలా తక్కువ. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ కు సంబంధించిన వివరాలు ఎస్ ఎమ్ ఎస్ విధానం ద్వారా తెలుసుకునేందుకు వీలు కల్పించింది.ఈకేవైసీ పూర్తి చేసుకున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు ఫోన్ మెస్సేజ్, మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

7738299899 నెంబర్ కు EPFOHO UAN ENG అని టైపు చేసి మెస్సేజ్ పంపిన కొద్ది సేపటికే ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించిన బ్యాలెన్స్ వివరాలు ఎస్ ఎమ్ ఎస్ రూపంలో అందిస్తారు. అదే విధంగా మీ పిఫ్ ఖాతాతో లింకైన మొబైల్ నెంబర్ నుండి 011-22901406 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే ఖాతా బ్యాలెన్స్ వివరాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.