Mamata Banerjee : హిందీలో మమత ట్వీట్..మండిపడుతున్న అభిమానులు

వెస్ట్ బంగాల్​లో భవానీపుర్​ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివ‌స్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు

10TV Telugu News

Mamata Banerjee వెస్ట్ బంగాల్​లో భవానీపుర్​ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివ‌స్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మమతా బెనర్జీ హిందీలో చేసిన ట్వీట్‌లో…భారతీయులు మరియు భాష సుసంపన్నం కోసం కృషి చేస్తున్న వారికి శుభాకాంక్షలు అంటూ తాను పోటీ చేయ‌బోతున్న భ‌వానీపూర్‌లోని ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు మమతా.

అయితే ఈ హిందీ ట్వీట్ చూసి మమత అభిమానులే తీవ్రంగా మండిప‌డుతున్నారు. హిందీ పట్ల మమత చూపిస్తున్న ఉత్సాహం బాధాకరం..హిందీ కోసం ఇంత‌లా ప‌రిత‌పిస్తున్నారు..భ‌వానీపూర్‌లో ఓట్ల కోస‌మే ఈ ప్ర‌య‌త్న‌మైతే…మీకు 2019లో వ‌చ్చిన ఫ‌లిత‌మే రిపీట‌వుతుంది అని, ఓ తృణ‌మూల్ అభిమాని ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌మ‌తా ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌బోయే భ‌వానీపూర్‌లో గుజ‌రాతీ, మార్వాడీ, పంజాబీ మాట్లాడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంది. ఇది గ‌మ‌నించే బీజేపీ మార్వాడీ అయిన ప్రియాంకా తిబ్రేవాల్‌ను బ‌రిలోకి దింపింది. ఈ నేప‌థ్యంలో మ‌మ‌త చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌య‌ట‌వాళ్లు కామెంట్‌తో బీజేపీ నాయ‌క‌త్వంపై దాడి చేసిన మ‌మ‌త ఇప్పుడు అదే బ‌య‌టివాళ్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఇలా హిందీలో ట్వీట్ చేయ‌డ‌మేంట‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాగా, భవానీపుర్​ ఉప ఎన్నికకు ఈ నెల 30న పోలింగ్​ జరగనుంది. అక్టోబర్​ 3న ఫలితం వెలువడనుంది.

మరోవైపు, భవానీపుర్​ ఉప ఎన్నికకు సీఎం మమతా బెనర్జీ సమర్పించిన నామినేషన్​ను తిరస్కరించాలని బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్​​ రిటర్నింగ్ అధికారికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మమత సమర్పించిన అఫిడవిట్​లో పెండింగ్​లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి చేప్పలేదని ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు. ఈ కేసులకు సంబంధించి మీడియా నివేదికలను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని, అలా చేయనందున మమత నామినేషన్​ చెల్లుబాటు కాదని వివరించారు.

READ Bhawanipur : మమత బెనర్జీకి సొంత ఇల్లు, వాహనం లేదట..!

READ Mamata Banerjee : భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి మమత నామినేషన్