Fake Army Major: ఆర్మీలో డ్రైవర్ జాబ్ కోసం రూ.3లక్షలు.. ఫేక్ ఆఫీసర్ వేషాలు

ఇండియన్ ఆర్మీ మేజర్ గా ఫోజిచ్చిన ఓ వ్యక్తి.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల్లో డబ్బులు దోచుకున్నాడు. ప్రస్తుతం నాశిక్ ఆర్టిలరీ సెంటర్ లో జరుగుతున్న రిక్రూట్మెంట్..

Fake Army Major: ఆర్మీలో డ్రైవర్ జాబ్ కోసం రూ.3లక్షలు.. ఫేక్ ఆఫీసర్ వేషాలు

Arrested

Fake Army Officer: ఇండియన్ ఆర్మీ మేజర్ గా ఫోజిచ్చిన ఓ వ్యక్తి.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల్లో డబ్బులు దోచుకున్నాడు. ప్రస్తుతం నాశిక్ ఆర్టిలరీ సెంటర్ లో జరుగుతున్న రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో ఖాళీలు ఉన్నాయని త్వరపడాలంటూ ఉద్యోగాభ్యర్థులను నమ్మబలికాడు. మేజర్ గణేశ్ పవార్ అంటూ చెప్పుకుని తిరిగిన వ్యక్తిని నాశిక్ పోలీసులు అరెస్టు చేశారు.

పూణెలోని సదరన్ కమాండ్ మిలటరీ ఇంటిలిజెన్స్ యూనిట్ ఇచ్చిన సమాచారం మేరకు డియోలలీ కంటోన్మెంట్ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనూ అతను ఆర్మీ మేజర్ యూనిఫామ్ లోనే ఉన్నాడు. అతని నుంచి సర్వీస్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఫామ్ 16లాంటి ఫేక్ సర్టిఫికేట్లు రికవరీ చేసుకున్నారు అధికారులు.

అంతేకాకుండా నిందితుడు ఫేక్ డాక్యుమెంట్లతో నాసిక్ లోని ఓ బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకున్నాడు. అతని వాహనం నడిపే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకుని ఆర్మీలో డ్రైవర్ గా జాబ్ ఇస్తానంటూ నమ్మబలికాడట.

ఇది కూడా చదవండి : అదే నా చివరి సినిమా : రాజమౌళి

కోర్టు ముందు ఫేక్ ఆఫీసర్ ను హాజరుపరిచి రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆర్మీలో ఉద్యోగాలంటూ మరికొందరి నుంచి డబ్బులు తీసుకున్న విషయం విచారణలో తేలింది. మేజర్ ర్యాంకులో యూనిఫామ్ ధరించి.. కంటోన్మెంట్ ఏరియాలో కనిపించిన వారిని మోసం చేసేవాడంటూ అధికారులు వివరించారు.