Prabhas : ప్రభాస్ పేరుతో అభిమాని హెయిర్ స్టైల్.. ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్

తాజాగా ప్రభాస్‌ వీరాభిమాని ఒకరు కొత్తగా తన అభిమానాన్ని చాటుకొని ప్రభాస్ కి షాకిచ్చాడు. ఈ వీరాభిమాని తలపై ప్రభాస్‌ అని ఇంగ్లీష్ అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని

Prabhas : ప్రభాస్ పేరుతో అభిమాని హెయిర్ స్టైల్.. ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్

Prabhas

Prabhas :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబాలి’ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. హీరోల కోసం అభిమానులు ఏదైనా చేస్తారు. ఒక్కోసారి వారి అభిమానం పీక్స్ కి వెళ్తుంది. హీరోలు కూడా అభిమానుల ప్రేమని చూసి మురిసిపోతారు. తాజాగా ప్రభాస్‌ వీరాభిమాని ఒకరు కొత్తగా తన అభిమానాన్ని చాటుకొని ప్రభాస్ కి షాకిచ్చాడు.

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పునీత్ భార్య

ఈ వీరాభిమాని తలపై ప్రభాస్‌ అని ఇంగ్లీష్ అక్షరాలు కనిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్‌ అయిన ప్రభాస్‌ అతడితో కాసేపు మాట్లాడాడు. అనంతరం తన వీరాభిమానికి ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇది ఫాజిల్‌ కంపెనీకి చెందిన వాచ్‌ అని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ అభిమానికి ప్రభాస్ తనతో మాట్లాడటమే కాదు ఏకంగా ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇవ్వడంతో అతని ఆనందానికి హద్దుల్లేవు.

Jai Bheem : ‘జై భీమ్’ సినిమాపై సీతక్క ట్వీట్.. రిప్లై ఇచ్చిన సూర్య

ప్రభాస్‌ తన అభిమానులకు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ కొంతమంది అభిమానులకు ప్రభాస్ బ‌హుమ‌తులు ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఇక ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతికి రానుంది.