Ram Charan: బుచ్చిబాబుకు టెన్షన్ తెప్పిస్తున్న చరణ్.. అయోమయంలో ఫ్యాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానాతో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Ram Charan: బుచ్చిబాబుకు టెన్షన్ తెప్పిస్తున్న చరణ్.. అయోమయంలో ఫ్యాన్స్!

Fans In Dilemma Over Ram Charan Buchi Babu Movie

Updated On : December 23, 2022 / 7:06 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానాతో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Ram Charan: చరణ్ మూవీలో మోహన్ లాల్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై మాత్రం అయోమయం నెలకొంది. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తవ్వాలంటే ఇంకా చాలా సమయమే పట్టేటట్లు ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే బుచ్చిబాబు చాలా కాలంగా తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తూ వస్తున్నాడు. దీంతో మరికొన్ని రోజులు ఆయన తన సినిమాను లాంచ్ చేయడానికి ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Ram Charan : రామ్ చరణ్ తండ్రి కాబోతుంటే.. తెగ బాధపడుతున్న కశ్మీరీ భామ..

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను ప్లాన్ చేసిన బుచ్చిబాబు, ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో చరణ్‌తో తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. మరి మెగా పవర్ స్టార్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో, ఎప్పటికి పూర్తి చేస్తాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.