Ram Charan : రామ్ చరణ్ తండ్రి కాబోతుంటే.. తెగ బాధపడుతున్న కశ్మీరీ భామ..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లు ఈరోజు మధ్యాహ్నం చిరంజీవి ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. మెగా వారసుడు వస్తున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది లేడీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలిసి బాధపడుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చరణ్...

Ram Charan : రామ్ చరణ్ తండ్రి కాబోతుంటే.. తెగ బాధపడుతున్న కశ్మీరీ భామ..

Sahiba Bali feeling sad for Ram Charan is going to be a father

Updated On : December 12, 2022 / 7:13 PM IST

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లు ఈరోజు మధ్యాహ్నం చిరంజీవి ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. 2012లో రామ్ చరణ్.. ‘ఉపాసన కామినేని’ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయ్యి దశాబ్దం అవుతున్న ఈ స్టార్ కపుల్ పిల్లలని కనకపోవడంతో, అనేక ఇంటర్వ్యూలో ఉపాసనని ఈ విషయంపై ప్రశ్నించేవారు.

Ram Charan : తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ట్వీట్ చేసిన చిరంజీవి!

ఇప్పుడు మెగా వారసుడు వస్తున్నాడు అని తెలియడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది లేడీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలిసి బాధపడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ దేవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా చరణ్ బాడీ మెయిన్‌టైన్స్‌కి, తన అవుట్ లుక్ కి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు.

RRR విడుదల సమయంలో రామ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేసిన సోషల్ పర్సన్ ‘సహీబా బలి’ అందరికి గుర్తు ఉండే ఉంటది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు కూడా నటించింది. కాగా ఈ వార్త తెలియడంతో సహీబా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. “మీరు ఎంతో ఇష్టంగా అభిమానించే ఒక పర్సన్ మరో వ్యక్తితో లవ్‌లో ఉన్నా, డేటింగ్‌లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా అతను హ్యాపీగా ఉంటాడు. కానీ నేను హ్యాపీ గానే ఉంటానేమో” అంటూ తెగ ఫీల్ అయ్యిపోతుంది ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ గా మారింది.