Vijay : బీస్ట్ సినిమా నచ్చలేదని థియేటర్‌కి నిప్పు పెట్టిన ఫ్యాన్స్
ఇవాళ బీస్ట్ సినిమా రిలీజ్ ఉండటంతో విజయ్ అభిమానులు తమిళనాడులో రాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా చేశారు. సినిమాపై భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లారు. అయితే ఈ సినిమాపై...........

Beast (1)
Beast : తమిళ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. వరుస హిట్స్ తో ఉన్న యువ దర్శకుడు నెల్సన్ ఈ సినిమాని తెరకెక్కించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ బీస్ట్ సినిమా రిలీజ్ ఉండటంతో విజయ్ అభిమానులు తమిళనాడులో రాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా చేశారు. సినిమాపై భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లారు.
అయితే ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అభిమానులకి తమ హీరో అని సినిమా నచ్చినా ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చలేదు. మొదటి ఆట నుండే సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. చాలా మంది విజయ్ అభిమానులు కూడా బీస్ట్ సినిమా నచ్చలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
Sonal Chauhan : ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలయ్య హీరోయిన్.. వరుస తెలుగు సినిమాలతో బిజిబిజీ..
తాజాగా బీస్ట్ సినిమా బాగోలేదని, సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయని తమిళనాడు మధురైలో ఓ థియేటర్ స్క్రీన్ కి అభిమానులు నిప్పు అంటించారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లో ఆందోళన ఏర్పడింది. విజయ్ అభిమానులు థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమా నచ్చకపోతే థియేటర్ కి నష్టం కలిగిస్తారా అంటూ విజయ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— ? Ajith Kumar? (@Anythingf4AJITH) April 13, 2022