Amaravati Lands : అమరావతి భూముల వేలం.. కుట్రకోణం ఉందని రైతుల అనుమానం

వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే వేలం ప్రక్రియ మొదలు కానుంది. రాజధాని రైతులు ఈ ప్రక్రియపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు.

Amaravati Lands : అమరావతి భూముల వేలం.. కుట్రకోణం ఉందని రైతుల అనుమానం

Amaravati Lands Auction

Amaravati Lands : రాజధాని అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంతంలోని భూములు అమ్మేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా రాజధాని భూములను విక్రయించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది.

తొలి విడతలో మొత్తం 248.34 ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయించింది. ఎకరా భూమి ధర కనీసం రూ.10కోట్లగా నిర్ధారించిన ప్రభుత్వం.. మొత్తం దాదాపు 2వేల 500 కోట్ల రూపాయలు సమీకరించనుంది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 389 జారీ చేసింది. వచ్చే నెలలోనే వేలం ప్రక్రియ మొదలు కానుంది.

Amaravati Lands : అమ్మకానికి అమరావతి భూములు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఎకరా రూ.10కోట్లు

భూముల వేలానికి సంబంధించి జీవో జారీ చేసినా.. తొలుత ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది ప్రభుత్వం. తర్వాత లీకులు రావడంతో రాజధాని ప్రాంతంలో భూముల వేలం బయటకు పొక్కింది. చంద్రబాబు హయాంలో బీఆర్ శెట్టి, అమరావతి మెడిసిటీ, లండన్ కింగ్స్ కాలేజీలకు కేటాయించిన భూములను వారు ఉపయోగించుకోలేదు. సమయం కూడా దాటిపోవడంతో ఆ భూములు తిరిగి ప్రభుత్వానికి చెందాయి. ఈ భూములను వేలం వేసి వచ్చిన నిధులను రాజధాని అభివృద్ధికి కేటాయిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది.

Amaravati Buildings : నిన్న భూములు, నేడు భవనాలు.. లీజుకు అమరావతి బిల్డింగ్స్.. సీఎం జగన్ మరో సంచలనం

అయితే, రాజధాని రైతులు మాత్రం ఈ ప్రక్రియపైన అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాజధానిని అభివృద్ధి చేసేందుకు తమ దగ్గర డబ్బులు లేవని జగన్ ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకి కూడా చెప్పింది. చంద్రబాబు ఈ నగరాన్ని సెల్ఫ్ సస్టైన్ బుల్ గా చెప్పేవారు. పరిస్థితులు మారిపోవడంతో అమరావతిని అభివృద్ధి చేసేందుకు భూములను వేలం వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో బీఆర్ శెట్టి, మెడిసిటీ కోసం ఇచ్చిన వంద ఎకరాలు.. లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులకు తన చేతుల మీదుగానే శంకుస్థాపన కూడా చేశారు. 2017 ఆగస్టు 10 మెడిసిటీ శంకుస్థాపన కూడా జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆ సంస్థలు తమ ప్రాజెక్టులను విరమించుకోవడంతో భూములన్నీ నిరుపయోగంగా ఉన్నాయి.