Film Shootings : తలసాని వద్దకు చేరిన సినీ పంచాయతీ..

మరికాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ సభ్యులతో విడివిడిగా మంత్రి తలసాని సమావేశం నిర్వహించనున్నారు. ఎక్కువ వేతనాలు ఎవరు ఇస్తే వారి షూటింగ్ లకు మాత్రమే హాజరవుతాము అని ఫెడరేషన్ సభ్యులు..........

Film Shootings : తలసాని వద్దకు చేరిన సినీ పంచాయతీ..

Talasani

Talasani Srinivas Yadav :  వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ కు మధ్య వివాదం మరింత ముదురుతుంది. టాలీవుడ్ లో ఇప్పటికే సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న 28 పెద్ద సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి. ఈ రోజు నుంచి యదావిధిగా షూటింగ్స్ లో పాల్గొనాలి అని తెలుగు పిలిం ఛాంబర్ కోరింది. ఒకవేళ పాల్గొనకపోతే మేమే ఆరు నెలల పాటు షూటింగ్స్ నిలిపి వేస్తామని నిర్మాతల మండలి హెచ్చరించింది. నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దని తెలుగు ఫిలిం ఛాంబర్ తెలిపింది.

అయితే ఎట్టిపరిస్థితుల్లో వేతనాలు పెంచేంత వరకు షూటింగ్ లకు హాజరుకాము అని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కన్నా 45 శాతం ఎక్కువ అడుగుతున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నిర్మాతలే నష్టపోతారని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. ఈ వివాదం బాగా ముదిరి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి చేరింది.

Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్

మరికాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ సభ్యులతో విడివిడిగా మంత్రి తలసాని సమావేశం నిర్వహించనున్నారు. ఎక్కువ వేతనాలు ఎవరు ఇస్తే వారి షూటింగ్ లకు మాత్రమే హాజరవుతాము అని ఫెడరేషన్ సభ్యులు అంటుండగా కార్మికులు మొండివైఖరి అవలంబిస్తే సినిమా నిర్మాణం ఆపడానికి కూడా సిద్ధం అంటున్నారు నిర్మాతలు. వివాదాన్ని పరిష్కరించే దిశగా మంత్రి తలసాని చర్చలు జరపనున్నారు. మరి మంత్రితో చర్చల తర్వాత ఈ వివాదం కొలిక్కి వచ్చి షూటింగ్స్ కి యాక్షన్ పడుతుందేమో చూడాలి.