Gajendra Singh Shekhawat: వ‌ర‌ద నిర్వ‌హ‌ణ బాధ్య‌త కేంద్ర స‌ర్కారు ప‌రిధిలోని అంశం కాదు: షెకావ‌త్

''సముద్రతీర కోత నియంత్రణ సహా వ‌ర‌ద నిర్వ‌హ‌ణ బాధ్య‌త అంతా రాష్ట్రాల ప‌రిధిలోని అంశం. ఇందుకు సంబంధించిన ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌, వాటిని అమ‌లు అంశాల‌ను ప్రాధాన్యక్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూసుకుంటాయి. కేంద్ర సర్కారు ఆర్థిక, సాంకేతిక సాయం మాత్రమే చేస్తుంది'' అని కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ స్ప‌ష్టం చేశారు.

Gajendra Singh Shekhawat: వ‌ర‌ద నిర్వ‌హ‌ణ బాధ్య‌త కేంద్ర స‌ర్కారు ప‌రిధిలోని అంశం కాదు: షెకావ‌త్

Shekavat

Gajendra Singh Shekhawat: వ‌ర‌దల ప్ర‌భావంతో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో భారీగా వ‌ర‌ద‌లు సంభవించిన విష‌యం తెలిసిందే. వ‌ర‌ద‌ల గురించి లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం ఇస్తూ వ‌ర‌ద నిర్వ‌హ‌ణ బాధ్య‌త రాష్ట్రాల ప‌రిధిలోని అంశ‌మ‌ని తెలిపింది. ”సముద్రతీర కోత నియంత్రణ సహా వ‌ర‌ద నిర్వ‌హ‌ణ బాధ్య‌త అంతా రాష్ట్రాల ప‌రిధిలోని అంశం. ఇందుకు సంబంధించిన ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌, వాటిని అమ‌లు అంశాల‌ను ప్రాధాన్యతాక్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూసుకుంటాయి” అని కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్(Gajendra Singh Shekhawat) స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర విపత్తు సహాయక నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌), జాతీయ విప‌త్తు స‌హాయ‌క నిధి (ఎన్డీఆర్ఎఫ్‌) కింద కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక‌ సాయం చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. అంతేగాక‌, కేంద్ర ప్ర‌భుత్వం వరద నిర్వహణ కార్యక్రమం (ఎఫ్ఎంపీ) కింద రాష్ట్రాల‌కు కేంద్ర స‌ర్కారు సాయం చేసింద‌ని చెప్పారు. న‌దుల నిర్వ‌హ‌ణ‌, వ‌ర‌ద, కోత‌ల నియంత్ర‌ణ‌, డ్రైనేజీల అభివృద్ధి వంటి కార్య‌క్ర‌మాల‌కు వాటిని వాడ‌తార‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం మొత్తం క‌లిపి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు రూ.6,686.79 కోట్లు విడుద‌ల చేసింద‌ని చెప్పారు. ఇలా వరదల విషయంలో కేంద్ర సర్కారు ఆర్థిక, సాంకేతిక సాయం మాత్రమే చేస్తుందని అన్నారు.

Maharashtra: శివ‌సేనలో చీలిక‌లు రావ‌డానికి సంజ‌య్ రౌతే కార‌ణం: రామ్‌దాస్‌ అథ‌వాలే