Stomach Ache : ఆహారం త్వరగా జీర్ణంకాక..కడుపునొప్పితో బాధపడుతున్నారా..?

కడుపునొప్పి ఉన్న సమయంలో సాధారణంగా వికారం, వాంతి వచ్చేలా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఉన్న సందర్భంలో నివారణకు అల్లం బాగా పనిచేస్తుంది. అల్లాన్ని చిన్న ముక్క నేరుగా తీసుకున్న

Stomach Ache : ఆహారం త్వరగా జీర్ణంకాక..కడుపునొప్పితో బాధపడుతున్నారా..?

Stomach Pain

Stomach Ache : రుచికరమైన వంటకాలు కనిపిస్తే చాలు అమాంతం వాలిపోతారు. శుచి,శుభ్రత గురించి ఏమాత్రం పట్టించుకోరు. వారికి ఘుమఘుమ సువాసనలు ఉంటే చాలా పరిమితికి మించి లాగించేస్తుంటారు. ఇలా మోతాదుకు మించి ఆహారం తీసుకునే వారిలో అనేక సమస్యలు ఎదరవుతాయి. అందులో ముఖ్యమైనది కడుపునొప్పి. దీనికి తోడు వాంతులు, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వన్నీ పిల్లలు, పెద్దల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈ సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

కడుపునొప్పి ఉన్న సమయంలో సాధారణంగా వికారం, వాంతి వచ్చేలా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఉన్న సందర్భంలో నివారణకు అల్లం బాగా పనిచేస్తుంది. అల్లాన్ని చిన్న ముక్క నేరుగా తీసుకున్నా లేకుంటే వంటల్లో ఉపయోగించినా మేలు కలుగుతుంది. ద్రవం రూపంలో అల్లం రసం తీసుకుంటే వెంటనే ఉపశమనం ఉంటుంది. జీర్ణ సంబంధమైన సమస్యలకు అల్లం అద్భుతమైన ఔషదంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సీమచామంతి పూర్వం నుండి పేగు సంబంధిత వ్యాధుల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కడుపునొప్పి వంటి వ్యాధులను తగ్గించేందుకు ఉపకరిస్తుంది. డయేరియా, అజీర్ణం, గ్యాస్, వాంతులు సీమచామంతి మొక్క బాగా పనిచేస్తుంది. కషాయం రూపంలో అందిస్తే పిల్లల్లో వచ్చే కడుపునొప్పులు తగ్గిపోతాయి. దీని పనితీరుపై నేటికీ అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

పుదీనా కూడా పేగు సంబంధిత అజీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక కడుపునొప్పి, ఉబ్బసం, మలబద్ధకం, డయోరియా వంటి ఇరిటబుల్ బొవెల్ సిడ్రోమ్ వ్యాదులకు చక్కగా ఉపయోగపడుతుంది. పేగుల్లో అనుకోకుండా వచ్చే కండరాల నొప్పి, వాంతులు లాంటివి ఈ పుదీనాతో నివారించవచ్చు. బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ మెడికల్ కళాశాల అధ్యయనాల్లో పుదీనా వల్ల జీర్ణసబంధిత సమస్యలను నివారించవచ్చని తేలింది.

పచ్చ అరటి. ఇది కూడా కడుపునొప్పితో కూడిన జీర్ణ సంభందిత సమస్యలను తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. పచ్చ అరటిలో ఉండే రెసిస్టెంట్స్ స్టార్చ్ అనే ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. యాంటి డయేరియా కారకాలు ఇందులో ఉంటాయి. రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లో పులిసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. పచ్చ అరటిలో విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ లు ఉంటాయి. పేగులు ఎక్కవ నీటిని పీల్చుకునే ప్రేరేపింస్తుంది. డయోరియా నివారణలో పచ్చ అరటి ఉపకరిస్తుందని వెనిజులా వైద్యుల పరిశోధనల్లో వెల్లడైంది.

కడుపునొప్పి వంటి జీర్ణసంబంధిత సమస్యలకు పెరుగు బాగా పనిచేస్తుంది. కడుపులో ప్రోబయెటిక్స్ అనగా మంచి సూక్మ్షజీవులను పెంచటంలో పెరుగు బాగా తోడ్పడుతుంది. పెరుగులో జీవించి ఉండే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. గ్యాస్, ఉబ్బసం కడుపునొప్పి వంటి సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియలకు ఇది బాగా ఉపకరిస్తుంది. పెరుగును తీసుకోవటం వల్ల ప్రోబయోటిక్స్ ఏర్పడి ఐబీఎస్ రుగ్మతలు తొలిగిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా ఫ్రొఫెసర్ రే బెనర్జీ తెలిపారు.