Karnataka Polls: డబ్బులు ఇచ్చి ఉండాల్సింది.. కర్ణాటక ఎన్నికలపై మాజీ సీఎం కుమారస్వామి హాట్ కామెంట్స్

రాష్ట్రంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో 72.67 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు 13వ (శనివారం) తేదీన విడుదల కానున్నాయి

Karnataka Polls: డబ్బులు ఇచ్చి ఉండాల్సింది.. కర్ణాటక ఎన్నికలపై మాజీ సీఎం కుమారస్వామి హాట్ కామెంట్స్

HD Kumaraswamy

Karnataka Polls: ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారంటూ ఒక పార్టీపై మరొక పార్టీ బురద చట్టుకోవడం మామూలే. అయితే సొంత పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఉండాల్సిందంటూ జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ అభ్యర్థులకు కనీస అవసరాలకు నగదు ఇవ్వలేకపోయానని ఆయన విచారం వ్యక్తం చేశారు. కొందరు అభ్యర్థులు సునాయాసంగా గెలిచేవారని, వారికి కొంత సాయం చేయాల్సి ఉండేదని అన్నారు.

Karnataka Polls: 15 సార్లు ఎన్నికలు, 3 సార్లే పూర్తి స్థాయి ప్రభుత్వాలు.. కర్ణాటకలో ఈసారైనా 5ఏళ్ల ప్రభుత్వం వచ్చేనా?

రామనగర జిల్లా కేతగానహళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌, బీజేపీ ఆర్థిక బలంతో ఎన్నికల్లోకి వెళ్లారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై సమాధానాన్ని దాటవేశారు. రెండు రోజుల తర్వాత ఫలితాలు వస్తాయని అప్పటిదాకా మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా రామనగర అభ్యర్థి నిఖిల్‌కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికలు ఆర్థికబలంతో సాగాయని విమర్శించారు. ఇందుకు ఓ యువకుడిగా తాను ఆవేదన వ్యక్తం చేస్తున్నాని నిఖిల్ అన్నారు.

Karnataka Polls: షెట్టర్ కష్టమే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం మళ్లీ ఓడిపోతారట?

రాష్ట్రంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో 72.67 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు 13వ (శనివారం) తేదీన విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని వెల్లడించాయి.