G20 Delegates Dance: మహిళలతో స్టెప్పులేసి సందడిచేసిన జీ20 ప్రతినిధులు.. వీడియో వైరల్

జీ20 ప్రతినిధులు స్థానిక మహిళలతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు. మంగళవారం రాత్రి ముంబైలోని కొలాబాకు వెళ్లే మార్గంలో గిర్‌గావ్ చౌపటీలో స్థానిక సాంప్రదాయ నృత్యకారులతో కలిసి నృత్యం చేశారు.

G20 Delegates Dance: మహిళలతో స్టెప్పులేసి సందడిచేసిన జీ20 ప్రతినిధులు.. వీడియో వైరల్

G20 Delegates

G20 Delegates Dance: జీ20 ప్రతినిధులు స్థానిక మహిళలతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు. మంగళవారం రాత్రి ముంబైలోని కొలాబాకు వెళ్లే మార్గంలో గిర్‌గావ్ చౌపటీలో స్థానిక సాంప్రదాయ నృత్యకారులతో కలిసి నృత్యం చేశారు. స్థానిక మహిళల నృత్యాన్ని అనుకరిస్తూ స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

G20 logo Row: జీ20 దేశాల ఢిల్లీ సదస్సు లోగోలో ‘కమలం’ గుర్తుపై వివాదం.. మమత ఆగ్రహం.. కేంద్ర మంత్రి స్పందన

భారతదేశం డిసెంబర్ 1న జీ20 యొక్క ఏడాది అధ్యక్ష బాధ్యతను చేపట్టింది. దేశంలో 55 ప్రదేశాల్లో 200 కంటే ఎక్కువ సమావేశాలు జరుగుతాయి. భారతదేశంలో జీ20 ప్రెసిడెన్సీలో డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ (డీడబ్ల్యూజీ) మొదటి దశ సమావేశం డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు ముంబైలో జరుగుతుంది. వీడియోలో జీ20 ప్రతినిధుల బృందం మహారాష్ట్ర పాటలకు స్టెప్పులేయడం కనిపించింది. గిర్గావ్ చౌపటీ వద్ద వారికి డప్పులు, లావణి, కోలి పాటలతో స్వాగతం పలికారు.

జీ20 ప్రతినిధులు దేశంలో నలుమూలల నుండి దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని సందర్శిస్తారు. జనవరి 23 – 24 వరకు వారు గుజరాత్‌లోని వారసత్వ సంపదను తిలకిస్తారు. రాబోయే నెలల్లో.. జీ20 ప్రతినిధులు కర్ణాటకలోని భోగ నందీశ్వర్ ఆలయం, మధ్యప్రదేశ్ లోని సాంచి స్థూపం, హైదరాబాద్ లోని చార్మినార్, గోల్కొండ కోట, తమిళనాడులోని మామల్లాపురం తీర దేవాలయం, రాజస్థాన్‌లోని మాండోర్ ఫోర్ట్, మాండోర్ గార్డెన్‌తో సహా స్మారక చిహ్నాలు, దేవాలయాలను కూడా సందర్శించనున్నారు. ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని కుతుబ్ ఆర్కియోలాజికల్ పార్క్, మట్టంచెర్రీ ఫ్యాలెస్, కొచ్చిలోని సెయింట్ ప్రాన్సిస్ చర్చి తదితర వాటిని సందర్శిస్తారు.