Gandeevadhari Arjuna Trailer : యాక్ష‌న్ మోడ్‌లో వరుణ్‌తేజ్‌.. ఆద్యంతం ఉత్కంఠ‌గా గాంఢీవధారి అర్జున ట్రైలర్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌.

Gandeevadhari Arjuna Trailer : యాక్ష‌న్ మోడ్‌లో వరుణ్‌తేజ్‌.. ఆద్యంతం ఉత్కంఠ‌గా గాంఢీవధారి అర్జున ట్రైలర్‌

Gandeevadhari Arjuna Trailer

Updated On : August 10, 2023 / 5:02 PM IST

Gandeevadhari Arjuna : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మిస్తున్నారు. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌యోష‌నల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

Vijay Deverakonda : నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాల్సిందే.. ఇండస్ట్రీలో నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు..

అందులో భాగంగా నేడు ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ 2020లో దేవుడు మీద మ‌నిషి గెలిచాడంట‌. జ‌స్ట్ పాతిక‌వేల సంవ‌త్స‌రాల‌లో మ‌నిషి చేసిన వ‌స్తువులు దేవుడు చేసిన వాటిని మించేసాయంట ఎలాగో తెలుసా..? అని న‌టుడు నాజ‌ర్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. దేశ ర‌క్ష‌ణ విష‌యంలో ఓ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆ స‌మ‌స్య నుంచి కాపాడ‌డానికి అర్జున్ వ‌స్తాడు. అస‌లు స‌మ‌స్య ఏంటి..? దాన్ని ప‌రిష్క‌రించ‌డంలో అత‌డు ఎదుర్కొన్న స‌వాళ్లుఏంటి..? వంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.