Vijay Deverakonda : నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాల్సిందే.. ఇండస్ట్రీలో నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు..

లైగర్ తరువాత విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చిందిగా..

Vijay Deverakonda : నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాల్సిందే.. ఇండస్ట్రీలో నన్ను గైడ్ చేసేవాళ్ళు లేరు..

Vijay Deverakonda about his rowdy attitude and liger movie result

Updated On : August 10, 2023 / 2:50 PM IST

Vijay Deverakonda : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. తన సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తో ఎక్కువ ఫేమ్ ని సంపాదించుకున్నాడు అనడంలో పెద్ద సందేహం లేదు అని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ కూడా విజయ్ కి ఫ్యాన్ అయ్యిపోయారు. పాన్ ఇండియా సినిమా లేకుండానే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు అనే చెప్పాలి. కానీ ఒక సినిమా మొత్తం మార్చేసింది.

Babu Mohan : మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు.. స్టేజిపై ఏడ్చేసిన బాబూమోహన్

పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమా విజయ్ దేవరకొండని బాగా బాధించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా విజయ్ మీద తన యాటిట్యూడ్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చేలా చేసింది. అయితే విజయ్ ఇప్పుడు తన యాటిట్యూడ్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు స్టేజి పై విజయ్ మాట్లాడుతుంటే ఒక యాటిట్యూడ్ కనిపించేది. కానీ ఇప్పుడు మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఈమధ్య పలు ఈవెంట్స్ లో పాల్గొన్నప్పుడు విజయ్ మాటల్లో ఆచితూచి వ్యక్తిత్వం కనిపిస్తుంది.

Nagababu : రజినీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ అట్రాక్షన్..

ఇక తాజాగా ఖుషి (Kushi) మూవీ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ..
“నాకు లైగర్ లాంటి ఫ్లాప్ కావాలి. అప్పుడే నేను నేర్చుకోగలను. నన్ను గైడ్ చేయడానికి ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకు ఒక సక్సెస్ వస్తే దాని నుంచి విజయం వైపు ఎలా వెళ్ళాలి అనేది అర్దమవుతుంది. అలాగే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనం ఏమి చేయకూడదు కూడా అర్ధమవుతుంది. మనం చేసిన తప్పుని మనం గ్రహించగలగాలి. అలాకాకుండా దానిని బలవంతంగా ప్రజల పై రుద్దాలి అని చూస్తే ఎన్నో విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది.

లైగర్ విషయంలో నేను చేసింది అదే. నా తప్పు తెలుసుకోక దానిని హిట్ బొమ్మ అంటూ తీసుకు వచ్చాము. ఇక నుంచి తన తదుపరి సినిమాల విషయంలో నేను నోరుమూసుకుని ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ అవి హిట్ సినిమా అయితే ఆడియన్సే బ్లాక్ బస్టర్ ట్యాగ్ ఇస్తారు. నా నెక్స్ట్ మూడు సినిమాలకు నేను మాట్లాడకూడదు, నా పనే మాట్లాడాలని సైలెంట్ గా ఉంటున్నా” అని చెప్పుకొచ్చాడు.