Babu Mohan : మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు.. స్టేజిపై ఏడ్చేసిన బాబూమోహన్

ప్రస్తుతం బాబు మోహన్ ఓ టీవీ ఛానల్ లో వచ్చే డ్రామా జూనియర్స్(Drama Juniors) అనే ప్రోగ్రాంలో జడ్జిగా అలరిస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజవ్వగా ఇందులో ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్స్ తో ఓ స్కిట్ వేశారు పిల్లలు. అది చూసి బాబు మోహన్ ఎమోషనల్ అయ్యి తన చిన్ననాటి సంగతులని గుర్తుచేసుకుంటూ ఏడ్చేశారు.

Babu Mohan : మూడో తరగతిలోనే అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు.. స్టేజిపై ఏడ్చేసిన బాబూమోహన్

Babu Mohan shares his childhood emotional moments and cried on stage

Updated On : August 10, 2023 / 11:09 AM IST

Babu Mohan : తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా ప్రేక్షకులని మెప్పించారు బాబు మోహన్. కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao)తో కలిసి అనేక సినిమాలలో మంచి హాస్యాన్ని పండించారు. వందల సినిమాలలో నటించి అనంతరం రాజకీయాల్లో కూడా సేవ చేశారు బాబు మోహన్. ప్రస్తుతం బాబు మోహన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో మాత్రం కనిపిస్తూ అలరిస్తున్నారు.

ప్రస్తుతం బాబు మోహన్ ఓ టీవీ ఛానల్ లో వచ్చే డ్రామా జూనియర్స్(Drama Juniors) అనే ప్రోగ్రాంలో జడ్జిగా అలరిస్తున్నారు. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజవ్వగా ఇందులో ఫ్యామిలీకి సంబంధించి ఎమోషన్స్ తో ఓ స్కిట్ వేశారు పిల్లలు. అది చూసి బాబు మోహన్ ఎమోషనల్ అయ్యి తన చిన్ననాటి సంగతులని గుర్తుచేసుకుంటూ ఏడ్చేశారు.

King of Kotha : కింగ్ అఫ్ కోత ట్రైలర్ రిలీజ్.. దుల్కర్ సల్మాన్ మాస్ యాక్షన్ వయోలెన్స్..

బాబు మోహన్ మాట్లాడుతూ.. నేను మాట్లాడలేకపోతున్నాను. నా చిన్నప్పుడు మూడో తరగతిలోనే మా అమ్మ చనిపోయింది. నాకు చిన్న చెల్లి ఉండేది. అప్పుడు తనకి నేనే జడ వేసి, తినిపించి చూసుకునేవాడిని. మా నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మేము ఎవరికి చెప్పుకోవాలో మా బాధ తెలిసేది కాదు అంటూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేశారు. అందర్నీ ఇన్ని సంవత్సరాలు నవ్వించిన బాబు మోహన్ వెనుక ఇంతటి కన్నీటి గాధ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.