Salman Khan: కృష్ణజింక కేసులో సల్మాన్‌ను క్షమించం: లారెన్స్ వెల్లడి

కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‪‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం అని లారెన్స్ చెప్పాడు. కృష్ణజింకను చంపాడనే కారణంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించింది.

Salman Khan: కృష్ణజింక కేసులో సల్మాన్‌ను క్షమించం: లారెన్స్ వెల్లడి

Salman Khan

Salman Khan: కృష్ణజింక హత్య కేసులో సల్మాన్ ఖాన్‌ను తన వర్గం ఎప్పటికీ క్షమించబోదని వెల్లడించాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్ణోయ్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా లారెన్స్ అనేక సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు.

Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

‘‘కృష్ణజింక హత్యకు సంబంధించి మా వర్గం ఎప్పటికీ సల్మాన్‪‌ను క్షమించదు. అతడు ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెబితేనే క్షమిస్తాం’’ అని లారెన్స్ చెప్పాడు. కృష్ణజింకను చంపాడనే కారణంతో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించింది. ఈ మేరకు 2018లో హత్యాయత్నం చేసింది. ఇటీవల సల్మాన్ తండ్రితోపాటు, అతడి లాయర్‌కు కూడా చంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఇద్దరికీ సిద్ధూ మూసేవాలా గతే పడుతుందని హెచ్చరిక లేఖల్లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు లారెన్స్‌ను ప్రశ్నించగా, అతడు తాజా విషయాలు వెల్లడించాడు. కృష్ణజింక హత్య కేసులో సల్మాన్ ఖాన్‌కు జైలు శిక్ష విధించినప్పటికీ బెయిల్ లభించింది. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర నేడు మళ్లీ ప్రారంభం

అయితే, ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌ను లారెన్స్ టార్గెట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. లారెన్స్ సంబంధీకులు కృష్ణజింకల్ని దైవంగా కొలుస్తారు. లారెన్స్ వర్గానికి ఆధ్యాత్మిక గురువు, దైవంతో సమానమైన జంబేశ్వర్ లేదా జంబాజీ ప్రతిరూపంగా కృష్ణజింకను భావిస్తారు. అలాంటి కృష్ణజింకను సల్మాన్ హత్య చేశాడనే కోపంతో అతడ్ని చంపేందుకు లారెన్స్ వర్గం ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ కేసును వాదించిన సల్మాన్ లాయర్‌ను బెదిరించారు. దీనిపై లాయర్, సల్మాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన సంపత్ నెహ్రాను 2018లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు లారెన్స్ ఈ విషయంలో సూత్రధారి అనే విషయం తెలిసింది.