Gay Marriage: ఇద్దరు మొగోళ్లు పెళ్లిచేసుకున్నారు.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన జంట.. ఫొటోలు వైరల్..

కోల్‌కతాకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు ఇటీవల వివాహం చేసుకున్నారు. జూలై 3న ఆదివారం జరిగిన పెండ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మల వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Gay Marriage: ఇద్దరు మొగోళ్లు పెళ్లిచేసుకున్నారు.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన జంట.. ఫొటోలు వైరల్..

Gay Marriage (2)

Updated On : July 5, 2022 / 3:56 PM IST

Gay Marriage: కోల్‌కతాకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు ఇటీవల వివాహం చేసుకున్నారు. జూలై 3న ఆదివారం జరిగిన పెండ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మల వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుక ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకున్నారు. వారి కలల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిషేక్ రే సంప్రదాయ బెంగాలీ వరుడిలా దుస్తులు ధరించి, ధోతీ-కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీని ధరించాడు.

 

Gay Marriage

ఈ జంట హిందూ సాంప్రదాయ పద్దతిలో అచ్చం యువతీ, యువకుల పెళ్లి మాదిరిగానే వివాహం చేసుకుంది. కలర్ కోఆర్డినేషన్ గ్లామర్‌ను జోడించినట్లు అనిపించింది. అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్ కాగా, చైతన్య శర్మ గురుగ్రామ్‌లో డిజిటల్ మార్కెటర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను వారి వెడ్డింగ్ ప్లానర్ కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో అవిరి వైరల్ గా మారాయి.

Gay Marriage (1)

స్వ‌లింగ సంప‌ర్కం అంటే ఇంత‌కుముందు నేరంగా చూసేవారు. కానీ ఇప్పుడు వారి మ‌న‌సుల‌నూ పెద్ద‌లు అర్థంచేసుకుంటున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు గేలు కుటుంబ స‌భ్యులు, మిత్రుల సమ‌క్షంలో వివాహం చేసుకొని ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. తాజాగా కోల్‌క‌తాలో గురుగ్రాంకు చెందిన అభిషేక్ రే, చైతన్య లు పెండ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Red Launchers (@red.launchers)