Google Currents : గూగుల్‌ ఆ మూడేళ్ల సర్వీసును షట్‌డౌన్‌ చేస్తోంది.. యూజర్ల పరిస్థితి ఏంటి?

ప్రముఖ సెర్చ్-ఇంజిన్ దిగ్గజం (Google) కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ సర్వీసుల్లో ఒకటైన Google Currents సర్వీసును త్వరలో షట్ డౌన్ చేయనున్నట్టు వెల్లడించింది.

Google Currents : గూగుల్‌ ఆ మూడేళ్ల సర్వీసును షట్‌డౌన్‌ చేస్తోంది.. యూజర్ల పరిస్థితి ఏంటి?

Google Currents Google Will

Google Currents Shutdown : ప్రముఖ సెర్చ్-ఇంజిన్ దిగ్గజం (Google) కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ సర్వీసుల్లో ఒకటైన Google Currents సర్వీసును త్వరలో షట్ డౌన్ చేయనున్నట్టు వెల్లడించింది. Google Suite యూజర్ల కోసం ప్రవేశపెట్టిన ఈ Currents సర్వీసును మూడేళ్ల తర్వాత షట్ డౌన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో ఈ కరెంట్స్ సర్వీసు నిలిచిపోనుంది.

వాస్తవానికి ఈ సర్వీసును గూగుల్ మొదటిసారిగా 2019లో ప్రారంభించింది. కరెంట్స్ సర్వీసుకు యూజర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో సర్వీసును మూసివేయాలని గూగుల్ నిర్ణయానికి వచ్చినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. గూగుల్‌ జీ సూట్‌ (Google Suite) యూజర్లకు కోసం ప్రవేశపెట్టిన కరెంట్స్‌ సర్వీసుకు యూజర్ల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. అందుకే ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని గూగుల్ భావిస్తున్నట్టు నివేదిక తెలిపింది. కరెంట్స్‌ సర్వీసు 2023లో పూర్తిగా షట్‌డౌన్ చేయనున్నట్టు గూగుల్‌ ధృవీకరించింది.

ప్రస్తుతం కరెంట్స్‌ సర్వీసును వినియోగిస్తున్న యూజర్లను గూగుల్‌ స్పేసెస్‌కు మారేందుకు వీలు కల్పిస్తామని గూగుల్‌ స్పష్టం చేసింది. ఇక కరెంట్స్‌లోని అన్ని ఫీచర్స్‌ను గూగుల్‌ స్పేసెస్‌ (Google Spaces)కు యాడ్ చేస్తామని తెలిపింది. ఈ గూగుల్ స్పెసెస్ సర్వీసు ద్వారా పెద్ద కమ్యూనిటీలు, భారీ సంఖ్యలో ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. గూగుల్ యూజ‌ర్లు చాటింగ్ ద్వారా స‌మాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఈ Spaces సర్వీసు ఉపయోగకరంగా ఉంటుంది. Gmail Inbox ద్వారా ద్వారా యూజర్లు Google Chat చేసుకోవచ్చు. గూగుల్‌ డాక్స్‌ (Google Docs)లో చెక్‌లిస్ట్‌ కోసం స్మార్ట్ కాన్వాస్‌ ఫీచర్‌ తీసుకొచ్చింది.

దీని ద్వారా యూజర్లు తమ డాక్యుమెంట్లు, వర్క్ షీట్స్, స్లైడ్స్ గూగుల్ మీట్ (Google Meet) ద్వారా షేర్ చేసుకోవచ్చు. గతంలో ఈ సర్వీసు Paid Users మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అందరి యూజర్లకు Free సర్వీసుగా అందిస్తోంది గూగుల్. గూగుల్ Currents యూజర్ల డేటాను మైగ్రేషన్ టైమ్‌లైన్‌తో అప్‌డేట్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గూగుల్ కరెంట్స్ సర్వీసు నుంచి Spacesకి ఎలా మారాలనే దానిపై ముందే నోటిఫై చేస్తామని కంపెనీ తెలిపింది.

Read Also : Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!