Google Chrome Update : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. తస్మాత్ జాగ్రత్త.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

Google Chrome Update : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తమ సర్వీసుల్లో Google Chrome వెబ్ బ్రౌజర్‌లో కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా మరో జీరో-డే (zero-day vulnerability)ని ఫిక్స్ చేసింది. 2022 నుంచి క్రోమ్‌లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించింది.

Google Chrome Update : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. తస్మాత్ జాగ్రత్త.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

Google fixes another zero-day vulnerability in Chrome, update now

Google Chrome Update : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తమ సర్వీసుల్లో Google Chrome వెబ్ బ్రౌజర్‌లో కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా మరో జీరో-డే (zero-day vulnerability)ని ఫిక్స్ చేసింది. 2022 నుంచి క్రోమ్‌లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించింది. CVE-2022-413గా ట్రాక్ చేసిన Google దీన్ని GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లోగా తెలిపింది.

ఇది ఒక రకమైన బఫర్ ఓవర్‌ఫ్లో అటాక్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రోగ్రామ్‌లోని కొన్ని అంశాలను ఉపయోగించుకునేందుకు డేటా దుర్బలత్వాన్ని దారితీస్తుందని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 22న గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్‌కు చెందిన క్లెమెంట్ లెసిగ్నే నివేదించారు. టెక్ దిగ్గజం నవంబర్ 24 న బ్లాగ్ పోస్ట్ ద్వారా బగ్ ఫిక్స్ రిలీజ్ చేసింది. అదే.. CVE-2022-4135 అప్‌డేట్ అని నివేదిక తెలిపింది.

Google ప్రకారం.. గూగుల్ Chrome వెబ్ బ్రౌజర్‌లో స్టేబుల్ ఛానెల్ Mac, Linux కోసం 107.0.5304.121కి అప్‌డేట్ అయింది. Windows కోసం 107.0.5304.121/.122 కూడా అప్‌డేట్ అందిస్తోంది. రాబోయే రోజుల్లో వారాల్లో ఈ బగ్ ఫిక్స్ అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. మీరు Chrome వినియోగదారు అయితే.. పైన పేర్కొన్న విధంగా మీ బ్రౌజర్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయడం మంచిది. అయితే, Google దుర్బలత్వాలకు సంబంధించిన వివరాలను సెర్చ్ దిగ్గజం వెల్లడించలేదు.

Google fixes another zero-day vulnerability in Chrome, update now

Google fixes another zero-day vulnerability in Chrome

అయితే మెజారిటీ యూజర్లు తమ బ్రౌజర్‌లోని అప్‌డేట్ చేసే వరకు బగ్ వివరాలు, లింక్‌లకు యాక్సెస్ పరిమితం చేయవచ్చునని కంపెనీ తెలిపింది. ఇతర ప్రాజెక్ట్‌లపై థర్డ్ పార్టీ లైబ్రరీలో బగ్ ఉన్నట్లయితే అందులోనూ పరిమితులను కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఇంకా ఆయా బగ్స్ ఫిక్స్ చేయలేదని నివేదిక వెల్లడించింది. ల్యాప్‌టాప్‌లో రన్ అయ్యే Google Chrome వెర్షన్‌ని మీరు ఎలా చెక్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

* మీ కంప్యూటర్‌లో Google Chromeని ఓపెన్ చేయండి.
* మీ స్క్రీన్ కుడి టాప్ కార్నర్‌లో ఉంచిన త్రి డాట్స్‌పై Click చేయండి.
* Menu List నుంచి ‘Help’పై Click చేయండి.
* ఇక్కడ, మీరు ‘Google Chrome About’ చూస్తారు. దానిపై Click చేయండి.
* మీ డివైజ్‌లో రన్ అయ్యే Chrome వెర్షన్ వివరాలతో కొత్త వెబ్‌పేజీని ఓపెన్ చేస్తుంది.
* మీ కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో Google Chromeని ఎలా అప్‌డేట్ చేయాలి
* పైన పేర్కొన్న దశను ఫాలో అవ్వండి.
* మీ Google chrome వెర్షన్ లేటెస్టుగా లేకుంటే, మీకు ‘Google Chromeని Update’ ఆప్షన్ కనిపిస్తుంది.
* మీరు ఈ బటన్‌ను కనుగొనలేదంటే.. మీరు లేటెస్ట్ వెర్షన్‌లో ఉన్నారని అర్థం.
* క్రోమ్ Relaunch బటన్‌పై Click చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్..!