Medicines: ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు.. త్వరలో కొత్త చట్టం

‘ఓవర్ ద కౌంటర్’ విధానంలో ఔషధాలు అమ్మేలా కొత్త చట్టం రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపు నుంచి మందులు కొనుగోలు చేయవచ్చు. అలాగని అన్ని రకాల మందులు కొనుగోలు చేసేందుకు వీల్లేదు.

Medicines: ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు.. త్వరలో కొత్త చట్టం

Medicines

Medicines: ‘ఓవర్ ద కౌంటర్’ విధానంలో ఔషధాలు అమ్మేలా కొత్త చట్టం రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపు నుంచి మందులు కొనుగోలు చేయవచ్చు. అలాగని అన్ని రకాల మందులు కొనుగోలు చేసేందుకు వీల్లేదు. ప్రజలు సాధారణ జబ్బులకు వాడే 16 రకాల మందులను మాత్రమే ఈ విధానంలో అనుమతించనున్నారు. పారాసిటమల్ వంటి కొన్ని మందులతోపాటు, లగ్జేటివ్స్, ఒళ్లు నొప్పులు, జలుబు, ముక్కు దిబ్బడకు వాడే మందులు, మౌత్ వాషెస్ వంటివి కూడా ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇస్తారు. దీనికోసం చట్టంలో మార్పులు చేయబోతున్న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

Crop Holiday: క్రాప్ హాలిడే దిశగా కోనసీమ రైతులు

1945, డ్రగ్స్ రెగ్యులేషన్ యాక్ట్‌లో మార్పులు చేయడం ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. దీని ప్రకారం ఐదు రోజులలోపు తగ్గే సాధారణ జబ్బులకు సంబంధించిన మందులనే ఈ నిబంధనలో చేరుస్తారు. మందులు వాడినప్పటికీ ఐదు రోజులకంటే ఎక్కువ రోజులు గనుక సమస్య వేధిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఈ చట్టానికి సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు కేంద్రం, ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ వివరాల్ని పొందుపరిచింది.