Crop Holiday: క్రాప్ హాలిడే దిశగా కోనసీమ రైతులు

రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది.

Crop Holiday: క్రాప్ హాలిడే దిశగా కోనసీమ రైతులు

Crop Holiday

Crop Holiday: రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి. దీంతో కోనసీమ రైతులు ఈ ఖరీఫ్ సీజన్‌లో క్రాప్ హాలిడే పాటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.

Goa Beach: గోవాలో దారుణం.. విదేశీయురాలిపై అత్యాచారం

తాజాగా జిల్లాలోని 12 మండలాల్లోనూ క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నామని రైతులు అంటున్నారు. ఈ సందర్భంగా పలు రైతు సమస్యల్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయాయి. పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేక పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రతి ఏటా మొదటి పంటకు తీవ్రంగా నష్టం కలుగుతోంది.

Remdesivir Vials: ఎక్స్‌పైరీ డేట్‌కు చేరువలో రెమిడెసివిర్‌లు.. 60 లక్షల ఇంజక్షన్ల ధ్వంసం

ముఖ్యంగా వరికి ఎక్కువ నష్టం కలుగుతోంది. వరిసాగు గిట్టుబాటు కాకపోవడంతో 2011లోనే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. అప్పట్నుంచి పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నప్పటికీ, వేటినీ నెరవేర్చడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.