మృతదేహానికి కూడా పెన్షన్, గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం

మృతదేహానికి కూడా పెన్షన్, గ్రామ వాలంటీర్ అత్యుత్సాహం

grama volunteer gives pension to death woman: విజయనగరం జిల్లాలో వాలంటీర్ల అత్యుత్సాం చూపించాడు. ఏకంగా చనిపోయిన మహిళకు కూడా పింఛన్ మంజూరు చేశారు. దీనికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

గుర్ల మండలం గుర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇజ్జిరోతు త్రీనాథ్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఎర్ర నారాయణ అనే మహిళ చనిపోయింది. అయితే సదరు వాలంటీర్ మహిళ మృతదేహం దగ్గరకు వెళ్లి ఆమె వేలిముద్ర తీసుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులకు ఫించన్‌ డబ్బు పంపిణీ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన మహిళకు ఎలా పింఛన్ మంజూరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

అధికారుల మెప్పు కోసమే వాలంటీర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని ఆయన తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.