Department of Labor : గ్రోసరీ షాప్ యజమానికి రూ.20 లక్షలు జరిమానా!

అమెరికాలోని మైనే నగరంలో గ్రోసరీ షాపు నిర్వాహకుడికి అక్కడి కార్మిక శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. అతడి షాప్ మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడంతో 27,274 డాలర్ల జరిమానా విధించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యాపారి న్యూ హాంప్‌షైర్, మైనే ప్రాంతాల్లో రెండు గ్రోసరీ షాపులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడే మాంసం అమ్మకాలు కూడా చేస్తుంటాడు. అయితే తన దుకాణంలో పనిచేసేందుకు ముగ్గురు మైనర్లను పెట్టుకున్నాడు.

Department of Labor : గ్రోసరీ షాప్ యజమానికి రూ.20 లక్షలు జరిమానా!

Department Of Labor

Department of Labor : అమెరికాలోని మైనే నగరంలో గ్రోసరీ షాపు నిర్వాహకుడికి అక్కడి కార్మిక శాఖ అధికారులు భారీ జరిమానా విధించారు. అతడి షాప్ మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడంతో 27,274 డాలర్ల జరిమానా విధించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యాపారి న్యూ హాంప్‌షైర్, మైనే ప్రాంతాల్లో రెండు గ్రోసరీ షాపులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడే మాంసం అమ్మకాలు కూడా చేస్తుంటాడు. అయితే తన దుకాణంలో పనిచేసేందుకు ముగ్గురు మైనర్లను పెట్టుకున్నాడు.

వారితో మాంసం కలిపే గ్రైండర్లు కడిగించేవాడు, యంత్రాలు నడిపించడం వంటివి చేసేవాడు. అయితే అమెరికా చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు వారితో మాంసం గ్రైండర్లు కడిగించడం, యంత్రాలు నడిపించడం నేరం. ఈ విషయం అమెరికాలో వ్యాపారం చేసే ప్రతి వ్యక్తికి తెలిసి ఉంటుంది. అయితే ఇతడు మాత్రం నిబంధనలను తుంగలోటికీ మైనర్లచేత చట్ట వ్యతిరేక పనులు చేయిచాడు. అంతే కాదు వారితో ఎక్కువ గంటల పని చేయించారు. అమెరికా నిబంధలు ప్రకారం మైనర్ విద్యార్థి రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే పనిచేయాలి. మేజర్ అయితే 8 గంటలు చేయవచ్చు.

అయితే తన గ్రోసరీ షాపులో పెట్టుకున్న ముగ్గురు పిల్లలతో మూడు గంటలకంటే ఎక్కువ పనిచేయించాడు నిర్వాహకుడు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ చేపట్టారు. విచారణలో గ్రోసరీ షాప్ యజమాని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని నిర్దారణ కావడంతో ఆయనకు 27,274 డాలర్ల జరిమానా విధించారు. ఇది భారత్ కరెన్సీలో 20 లక్షలకు పైమాటే.