Pet Dog Name Issue :పెంపుడు కుక్కకు ‘సోను’పేరు..మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన పక్కింటి వ్యక్తి

పెంపుడు కుక్కకు 'సోను'పేరు..మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు పక్కింటి వ్యక్తి. ఎందుకంటే..

Pet Dog Name Issue :పెంపుడు కుక్కకు ‘సోను’పేరు..మహిళపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన పక్కింటి వ్యక్తి

Gujarat Crime Pet Dog Name Issue..

Gujarat crime Pet Dog Name Issue..: పెంపుడు కుక్కలకు యజమానులు వారికి ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకుంటారు. జాకీ, రాఖీ, స్నూపీ అంటూ రకరకాల పేర్లు పెట్టుకుంటుంటారు. అలాగే గుజరాత్ కు చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్కకు ముద్దుగా ‘సోని’అని పేరు పెట్టుకుంది. అదే ఆమెకు పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. పక్కింటివారి కి ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. ఆమె ప్రాణంమీదకు తెచ్చింది. పెంపుడు కుక్కకు పేరు పెట్టుకుంటే ప్రమాదమేంటీ? అంటే..

గుజరాత్‌లో ఓ మహిళ తాను ప్రేమగా పెంచుకుంటున్న కుక్కకు సోను అని పేరు పెట్టుకుంది. ఓ కుక్కకు ‘సోను’అని పేరు ఎలా పెడతావంటూ ఆమె పొరుగింటి వారు రంకెలేశారు. ఆమెపై పోట్లాడకు వచ్చారు. ఇష్టమొచ్చినట్లుగా నానా తిట్లు తిట్టారు. అక్కడితో ఊరుకోకుండా ఏకంగా ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఏమాత్రం ఊహించని ఆ దారుణానికి ఆమె షాక్ అయ్యింది. షాక్ నుంచి తేరుకునేలోపే ఆమెపై కిరోసిన్ పోయటం..నిప్పు పెట్టటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. దీంతో ఆమె ఒళ్లంతా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన ఘటన గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలోని ఓ పట్టణంలో సంచలన సృష్టించింది.

భావ్‌నగర్ జిల్లాలోని పలిటానా పట్టణంలో 33 ఏళ్ల నీతాబెన్ సర్వయియా అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. వారు ఓ కుక్కను పెంచుకుంటున్నారు.దానికి ముద్దుగా ‘సోను’అని పేరు పెట్టుకున్నారు. సోను సోను అంటూ పిలుచుకుంటున్నారు. అది పక్కింటివారికి నచ్చలేదు. కోపంతో రగిలిపోయారు. తమను అవమానించటానికే వారి కుక్కకు సోను అని పేరు పెట్టుకుని..అస్తమాను ‘సోను సోను’ అంటూ పిలుస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎందుకంటే అతని పేరు సురభాయ్ భర్వాద్‌. అతని భార్య పేరు ‘సోను’ .

ఈ క్రమంలో నీతా పక్కింటి వ్యక్తి సురభాయ్ భర్వాద్ గత సోమవారం (డిసెంబర్ 20,2021) నీతాబెన్ ఇంటిమీదకు మరో ఐదుగురు వ్యక్తుల్ని తీసుకుని దూకుడుగా వచ్చాడు. ఆ సమయంలో నీతాబెన్ భర్త, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లారు. తన చిన్నకొడుకుతో కలిసి ఉంట్లో నీతా ఉంది. అదే సమయంలో నీతా వంటగదిలో ఉంది. సురభాయ్ నీతా బెన్ ఇంటిలోపలికి వచ్చి..రావటం రావటంతోనే పెద్ద పెద్దగా అరుస్తు గొడవకు దిగాడు. అస్తమాను సోను సోను అని ఎందుకు పిలుస్తున్నారు? మీ కుక్కకు సోను అని ఎందుకు పేరు పెట్టారు? అంటూ అరిచాడు.దానికి నీతా షాక్ అయ్యింది.

అతను మాట్లాడి ఏంటో ఆమెకు అర్థం కాలేదు. కాసేపటికి అర్థమైంది. మా కుక్కను మా ఇష్టమొచ్చినట్లు పిలుచుకుంటాం మీకేంటీ? అంటూ ప్రశ్నించింది. దీతో సురభాయ్ భర్వాద్ రెచ్చిపోయాడు. ఆమెను ఇష్టమొచ్చిన్నట్లుగా తిట్టాడు. నానా యాగీ చేశాడు. అలా గొడవ పెద్దది అయ్యింది. దీంతో నీతామీద వంట ఇంటిలో ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకుని సురభాయ్ భర్వాద్ ఆమెపై పోసాడు..అతని కూడా వచ్చినవారిలో ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. అంతే ఆమె పెద్ద పెద్దగా అరిచింది. ఆ షాక్ నుంచి కోలుకునే లోపే ఆమె శరీరం చాలా వరకు గాయాలయ్యాయి.

ఈ ఘటనపై పోలీసులు బాధితురాలి వాగ్ములం తీసుకుని నిందితులపై కేసు నమోదు చేసి భార్వాద్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా..వాళ్లు కావాలనే ఉద్దేశపూర్వకంగా వారి కుక్కపిల్లకి తన భార్య ‘సోను’ అని పెట్టారని దీంతో ఆగ్రహంతోనే ఆమెతో గొడవపడ్డాను గానీ చంపాలని కాదని చెప్పుకొచ్చాడు. ఈ కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు.